Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 12:43 pm Posted by : praja deveena

District Collector Chandrasekhar : ప్రభుత్వ పథకాలకు రుణాలకోసం డీసీసీబీ చొరవచూపాలి

 

District Collector Chandrasekhar : ప్రజా దీవన నల్గొం డ : నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతు ల కు పంట రుణాలతో పాటు, స్వయం సహాయక మహిళ సం ఘాలకు ,ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణపంపిణీలో చొరవచూపాలని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నా రు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాం కు సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశా నికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇ స్తున్నప్పటికీ లబ్ధిదారు ముందుగా బేస్మెంట్ వరకు నిర్మిం చు కోవలసి ఉన్నందున,లబ్ధిదారులు పేదవారైనందున బే స్మెంట్ వరకు నిర్మించుకునేం దు కు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశాన్నిపరిశీలించాలని కలెక్టర్ అన్నారు.

ఈ విషయంలో డిసిసి బ్యాంక్ మే నేజర్లు చొరవ చూపించా లని కోరారు. ఇందిర మహిళ శక్తి కార్యక్రమం కింద జిల్లాలో ని స్వయం సహా య క మహిళా సంఘాలు అనేక కార్య క్ర మాలను అమలు చేస్తున్నాయని, ఇందులో భాగంగా వారికి త క్కువ వడ్డీకి రుణాలు ఇచ్చినట్ల యితే ఎక్కువమంది గ్రూ ప్ సభ్యు లు రుణ సౌకర్యం పొంది లాభప డేందుకు అవకా శం ఉందని, ఈ ది శగా చర్యలు తీసుకోవాలని, అం తేకాక జిల్లా సహకార కేంద్ర బ్యాం కు ద్వారా ఇచ్చే రుణాలపై పెద్ద ఎ త్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్ట ర్ అన్నారు.

నల్గొండ జిల్లాలో దాన్యంతో పా టు వివిధ రకాల వ్యవసా య ఉ త్ప త్తులు పెద్ద ఎత్తున పండించడం జరుగుతు న్నద ని, అందువల్ల ఆయా అనువైన ప్రదేశాలలో కోల్డ్ స్టోరేజ్ లు, ఆహార ఉత్పత్తులు నిల్వ ఉం చుకునేందుకు ఉండే అవ కా శాల ను పరిశీలించి వారికి రుణ సౌకర్యం అందించాలని, డి సిసి బ్యాంక్ ఆధ్వర్యంలో స్థలాలను గుర్తించి గో డౌన్ నిర్మిం చే విధంగా చర్యలు చేప ట్టాలని అన్నారు. రబీ దాన్యం కొ నుగోలు ప్రారంభమవుతున్న దృ ష్ట్యా పిఎసిఎస్ ల ద్వారా నిర్వ హించే ధాన్యం కొనుగోలుకు సంబంధిత సొసైటీలు ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్ట ర్ చెప్పారు.

అంతకుముందు నల్గొండ జిల్లా కేం ద్ర సహకార బ్యాంకు సీఈవో శంకర్రావు మాట్లాడుతూ 1917 లో ప్రా రంభమైన నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 108 సొసైటీలతో అ భివృద్ధి పథంలో ముందుకు సాగు తున్నదని, 1000 కోట్ల అభివృద్ధిని సాధించిందని తెలిపారు. ఈ సంద ర్భంగా ఆ యన డిపాజిట్లు, రుణాలు, రైతులకు, గృహ నిర్మాణానికి, విద్యార్ణాలు, వ్యక్తిగత రుణాలు, తదితర రంగాలలో ఇచ్చిన రుణా లు, తదితర అంశాలను వివరించా రు. జిల్లా సహ కార అధికారి పత్యానాయక్, యాదాద్రి, భువనగిరి జిల్లా, సూర్యాపేట డిసిఒలు రమణ, ప్రవీణ్, డిసిసి బ్యాంకు డిడి ఎం తదితరులు ఉన్నారు.