Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 11:13 am Posted by : praja deveena

District Collector Chandrasekhar : సత్యమార్గాలు బోధించిన సంత్ సే వాలాల్ మహారాజ్ ఆదర్శం

 

District Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: నీతి, నిజాయితీ, ధర్మంవంటి సత్యమార్గాలు బో ధించిన సంత్ సేవాలాల్ మ హా రాజ్ ను ఆదర్శంగా తీసు కుని సమాజం ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్ సేవలాల్ మహరాజ్ 28 7వ జ యంతిని పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కేం ద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వ హించిన సంత్ సేవా లాల్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహా రాజ్ లంబాడా, గిరిజన జాతిలోని మూఢనమ్మకాల ను పారద్రోలి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సంత్ సే వాలాల్ మహరాజ్ స్ఫూర్తితో రూపొందించిన రాజ్యాంగం, హక్కులు ,ప్రభుత్వ పథకాలను పేద, నిమ్న వర్గాలకు అం దించేందుకు ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు.

ఎస్టీ, బంజారాలకు సమాజ స్థితిగతులను తెలియజేశారని, సంత్ సే వాలాల్ నీతి,న్యాయం , ధర్మాన్ని పాటించాలన్న వారి మార్గదర్శకాలను, ఆయన ఆశయాలను ముం దుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను జిల్లా లోని అన్ని నియోజకవర్గాలు, మం డలా ల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీ నివాస్ రెడ్డి మాట్లాడు తూ సంత్ సే వాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక గురువని, సేవ, ధర్మం సమ భావనల ను బోధించారని, సత్సంగ్ ద్వారా స మాజాన్ని మంచి మార్గంలో పయనించేందుకు కృషి చేశా ర న్నారు. ఈ సమావేశానికి ప్రవీణ్ నాయక్ అధ్యక్షత వహించి మాట్లాడగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, లంబాడ హక్కుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సకృ నా యక్, ఎరుకల సంఘం అధ్యక్ష్యులు నరసింహ తదితరులు మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్, డిప్యూ టీ మేయర్ అశ్రఫ్ అలీ, తహసిల్దార్ పరశురాం, కార్పొరేటర్లు దీప్లానాయక్, నాగార్జున, రవి నాయక్, ఇతర లంబాడా సం స్థల ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్, మేయర్ , డిప్యూటీ మేయర్, తదితరులు సంతు సే వాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.