Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 3:28 pm Posted by : praja deveena

District SP Sharath Chandra Pawar : నల్లగొండలో పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో సౌహార్దానికి ప్రతీకగా ఘన ఇఫ్తార్ విందు

District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: పవిత్ర రం జాన్ మాసం సందర్భంగా నల్లగొం డ పట్టణం సౌభ్రాతృత్వంతో కళక ళలాడింది. జిల్లా పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో మంగళవారం నిర్వహిం చిన దావతే ఇఫ్తార్ కార్యక్రమం హ ర్షాతిరేక వాతావరణంలో ఘనంగా జరిగింది. ముస్లిం సోదరులతో కలి సి అధికారులు ఇఫ్తార్ విందులో పాల్గొని మతసౌహార్దానికి నిదర్శ నంగా నిలిచారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఉపవాస దీక్ష లో ఉన్న ముస్లిం సో దరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పా టు చేయడం ఆనందంగా ఉంద న్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పు డూ ప్రజలకు అండగా నిలిచి, వారి స మస్యల పరిష్కారా నికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిస్తూ జిల్లా ప్రజ లందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రే మ, ఐక్య త, సానుభూతి విలువలను పెం పొందించే పవిత్ర సందర్భమని పే ర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు ప్రతి అ ర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని అ ని పేర్కొన్నారు. అందరూ సుఖ శాంతులతో పండుగ జరు పుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ముస్లిం మత గురు వులు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించగా, మొ త్తం వేడుక స్నే హభావ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, మిర్యాలగూడ డీఎ స్పీ రాజశేఖర్ రాజు, సీఐలు, ఆర్‌.ఐలు, ఎస్సైలు, ఇతర పో లీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాల య చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ ఆ మేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, కార్పొరేటర్లు, పట్టణ ప్ర ముఖులు, ముస్లిం మతగురువులు తదితరులు హాజర య్యారు.