Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Do not be careless with heavy rains అతి భారీ వర్షాలతో అజాగ్రత్త వద్దు

-- అధికారులకు సీఎస్ శాంతి కుమారి ఆదేశం

అతి భారీ వర్షాలతో అజాగ్రత్త వద్దు

— అధికారులకు సీఎస్ శాంతి కుమారి ఆదేశం

ప్రజా దీవెన /హైదరాబాద్: రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి నేపద్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అలెర్ట్ చేశారు. అతి వర్షాల విషయంలో అజాగ్రత్త వద్దని అధికార యంత్రాగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ ఆదేశించారు.

ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు.ఇప్పటికే గోదావరి బేసిన్‌లో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నాయి.

ఇక ఈ రెండు రోజుల్లో కురిసే అత్యంత భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశముంది. నిండిన ప్రతీ చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే ల వద్ద ప్రత్యేక అధికారులతో పాటు పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలని అధికారులకు సీఎస్ సూచించారు.

లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గుర్తించిన పునరావాస కేంద్రాలలో అవసరమైన వస్తు సామాగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.