జేఎల్ రాత పరీక్షలు ఎప్పుడో తెలుసా
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణ రాష్టంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1392 జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించి తాజా సమాచారం విడుదల చెసింది టీ ఎస్ పి ఎస్ సి.
సదరు నియామకాలకు సంబంధించి ఈ నెల 12 నుంచి అక్టోబర్ 3 వరకు రాత పరీక్షలు ఉంటాయని వెల్లడిస్తూనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పటికే అన్ లైన్ లో టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులు వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
అభ్యర్థులు లాగిన్ అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంటూనే 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జరుగనున్నాయి. కాగా సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబర్ 12వ తేదీన ఆంగ్ల పరీక్ష, ఆర్థికశాస్త్రం, వృక్షశాస్త్రం పరీక్షలు : సెప్టెంబర్ 13న, అదే విధంగా సెప్టెంబర్ 14న మ్యాథమెటిక్స్ పరీక్ష, కెమిస్ట్రీ పరీక్ష సెప్టెంబర్ 20న, ఇక సెప్టెంబర్ 21న తెలుగు పరీక్ష, భౌతికశాస్త్రం, జంతుశాస్త్రం పరీక్షలు సెప్టెంబర్ 22న, సెప్టెంబర్ 25న కామర్స్ , సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్ పరీక్షలు సెప్టెంబర్ 26న, ఇక
హిందీ పరీక్ష సెప్టెంబర్ 27న, హిస్టరీ, సంస్కృతం పరీక్షలు సెప్టెంబర్ 29న ఉండగా ఉర్దూ పరీక్ష అక్టోబర్ 3న నిర్వహించనున్నారు.