దరఖాస్తులకు గడువు ఎప్పుడో తెలుసా…!
— నేడే ‘ నవోదయ ‘ కు ఆఖరు
— ఏపీ లో 15, తెలంగాణలో 9 పాఠశాలలు
ప్రజా దీవెన/హైదరాబాద్: నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకి గాను అన్ లైన్ దరఖాస్తులు (online applications) తీసుకునే ప్రక్రియ చివరి దశకు చేరుకుoది.
దేశవ్యాప్తంగా 649 జవహర్ ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు గడువు ఆగస్టు 17(నేటి)తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష (Entrance Test) నిర్వహించనుoడగా వాస్తవానికి ఆగస్టు 10తో ముగియాల్సిన గడువును ఆగస్టు 17 వరకు పొడిగించిన విషయం విదితమే.
నవోదయ విద్యాలయ సమితి(Navodaya Vidyalaya Samiti) పరిధిలోని మొత్తం 649 జేఎన్వీల్లో దాదాపు 48 వేల వరకు సీట్లు అందుబాటులో ఉండగా ఒక్కో నవోదయ విద్యాలయంలో 80 మంది విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు.
జేఎన్వీ ప్రవేశ పరీక్షను హిందీ, ఇంగ్లిష్ లతో పాటు పాటు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో (In regional languages of states) నిర్వహిoచనుoడగా ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణలో 9 అందుబాటులో ఉండగా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు.
మొత్తం సీట్లలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు ఉంటాయి.
2023-2024 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్నవారు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్టు (Jawahar Navodaya Vidyalaya Selection Test) రాయడానికి అర్హులు. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. విద్యార్థులు తప్పనిసరిగా సంబంధిత నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాలో నివాసి అయి ఉండాలి.
ప్రవేశాల్లో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులతో భర్తీ చేస్తారు. గ్రామీణ ప్రాంత కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో లేదా గుర్తింపు పొందిన ఇతర స్కూళ్లలో చదవి ఉండాలి.
మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలవారికి అవకాశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు ఉంటాయి. దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు.