Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Do you know which day that day will go down in history: ఆ రోజు ఏ రోజో తెలుసా…చరిత్రలో నిలిస్తుంది

-- అదేనoడి చందమామ మన చేతికి అందిన రోజు -- చిరస్మరణీయంగా చరిత్రలో 2023 ఆగస్టు 23వ తేదీ -- జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలన్న కేంద్రం

ఆ రోజు ఏ రోజో తెలుసా…చరిత్రలో నిలిస్తుంది

— అదేనoడి చందమామ మన చేతికి అందిన రోజు
— చిరస్మరణీయంగా చరిత్రలో 2023 ఆగస్టు 23వ తేదీ
— జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలన్న కేంద్రం

ప్రజా దీవెన/న్యూఢిల్లీ: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ రోజు చరిత్రపుటల్లో నిలువనుంది. అదేనండి చందమామ మన చేతికి చిక్కిన రోజు. ఇంకా అర్ధం కాలేదా అదే 2023 ఆగస్టు 23వ తేదీ. దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజని (23rd August 2023 A memorable day in the history of the country) అందరికి తెలిసిందే. ఆ రోజే చందమామ మన చేతికి అందడంతో పాటు జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు కావడం విశేషం.

భారతదేశం నింగిని జయించిన రోజు, ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర విజయ తీరాలకు చేరి దిగ్విజయమైన రోజు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మాడ్యుల్ చందమామ దక్షిణధృవంపై అడుగు మోపింది ఆ రోజే. చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని (The central government took a key decision to mark the success of Chandrayaan 3) తీసుకుంది.

చంద్రయాన్ 3 జాబిల్లిపై అడుగుపెట్టిన రోజైన ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని (August 23, the day Chandrayaan 3 landed on Zabili, should be celebrated as National Space Day) నిర్ణయించిoది. ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు నాడు ప్రత్యేకంగా సైన్స్ ఎగ్జిబిషన్లు, సెమినార్లను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పర్సనల్ డిపార్ట్‌మెంట్ అదనపు కార్యదర్శి సంధ్యా వేణుగోపాల్ శర్మ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది (Programs related to space research should be organized in educational institutes, colleges and universities in all states across the country) రోజున. దీనివల్ల యువతలో స్పేస్ పట్ల మరింత అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు.

రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా (Laser Induced Breakdown Spectroscopy (LIBS), an alpha particle X-ray spectrometer on the rover as payloads) పంపించారు శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ ఇయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్ వoటి పేలోడ్స్ కీలక డేటాను సేకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించి ఇస్రో కీలక సమాచారాన్ని సేకరించింది.

చందమామ దక్షిణ ధృవంపై రసాయన, ఖనిజ నిల్వలు భారీగా ఉన్నట్లు గుర్తించింది. ప్రత్యేకించి- సల్ఫర్ నిల్వలు భారీగా ఉన్నట్లు నిర్ధారించింది. మనిషి జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ సైతం ఉందనే విషయాన్ని ఇస్రో నిర్ధారించింది (ISRO has confirmed that there is oxygen which is necessary for human life) ఈ ప్రయోగం ద్వారానే.

ఆక్సిజన్, సల్ఫర్‌, అల్యూమినియం, క్యాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని (Oxygen, Sulphur, Aluminium, Calcium, Iron, Chromium, Titanium, Oxygen reserves are there) లిబ్స్ పేలోడ్ గుర్తించి నట్లు ఇస్రో తెలిపింది. అత్యధిక శక్తి గల లేజర్ కిరణాలను లిబ్స్ ప్రసారం చేయగలదు. చంద్ర శిలలు, లేదా మట్టి లక్షణాలను తెలుసుకోవడానికి లిబ్స్‌ను వినియోగించింది ఇస్రో.