Do you know who are the guests of Ayodhya: అయోధ్య అతిథులు ఎవరో తెలుసా
--రామ మందిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు వీళ్లే
అయోధ్య అతిథులు ఎవరో తెలుసా
–రామ మందిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు వీళ్లే
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: పవిత్ర నగరమైన అయోధ్యలో రామ మంది ర దేవాలయం నిర్మితమైంది. ఈ రామ మందిరాన్ని ఇదే మాసం జ నవరి 22వ తేదిన ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్స వానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలతో ఒక భక్తి భావన దావానలంలా వ్యా పించింది. జనవరి 22న బాల రాముడి విగ్రహాన్ని రామ మందిర గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు.
అట్టహాసంగా జరిగే ఈ దృశ్యాలను చూసేందుకు ప్రజలు అయో ధ్యకు తరలివస్తు న్నారు. ప్రాణప్రతిష్ఠకు ముందుగా జనవరి 16వ తేదీ నుంచి జనవరి 21 వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రధాన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22 మధ్యాహ్నం 12.20 నుంచి ప్రారంభమై 1 గంట వరకు జరుగుతుంది. 121 మంది పండితులు వేదమంత్రాలు చదువుతూ ఈ అత్యంత పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
దీనిని వీక్షించేందుకు అయోధ్య రామ మందిరానికి వచ్చే ముఖ్య అతిథులు చాలామంది ఉన్నారో వారెవరో తెలుసుకుందాం. అయో ధ్యరామమందిర ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ పాల్గొననున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బిఎపిఎస్ స్వామినారాయణ సంస్థ, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అఖిలేష్ యాదవ్, మల్లికార్జున్ ఖర్గే (ఆహ్వానం తిరస్కరించారు), సోనియా గాంధీ (ఆహ్వానం తిరస్కరించారు), అధీర్ రంజన్ చౌదరి (ఆహ్వానం తిరస్కరించారు), మన్మోహన్ సింగ్ , పారిశ్రామికవేత్త లను కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.
వారిలో గౌతమ్ అదానీ, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, ఎన్ చంద్రశేఖరన్, అనిల్ అగర్వాల్, ఎన్ఆర్ నారాయణ మూర్తి ఉన్నారు.సినీ ప్రముఖులు సైతం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు వద్దకు తరలి రానున్నారు. వారిలో మోహన్‌లాల్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్, చిరంజీవి, సంజయ్ లీలా భన్సాలీ, అక్షయ్ కుమార్, ధనుష్, రణ్‌దీప్ హుడా, రణ్‌బీర్ కపూర్, కంగనా రనౌత్, రిషబ్ శెట్టి, మధుర్ భండార్కర్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ అజయ్ దేవగన్, యష్, ప్రభాస్, ఆయుష్మాన్ ఖురానా, అలియా భట్, సన్నీ డియోల్ ఉన్నారు.
ఇక క్రీడాకారుల విషయానికొస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, దీపికా కుమారి రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఈ అతిధులతో సహా సాధువులు, పలు రంగాల్లో విశేష కృషి చేసి పేరు తెచ్చుకున్న వారు రానున్నారు. మొత్తంగా 7000 మంది హాజరయ్యే అవకాశం ఉంది.