Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు.

ప్రాణం పోసేది దేవుడైతే.. ప్రాణాలను నిలబెట్టే వారు వైద్యులు భారత వైద్య రంగంలో బిసి రాయ్ ఆదర్శప్రాయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్య లతోనే తెలంగాణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు కేసీఆర్ చేపట్టిన ఆరోగ్యయజ్ఞం లో వైద్యుల పాత్ర భేష్

తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు.

ప్రాణం పోసేది దేవుడైతే.. ప్రాణాలను నిలబెట్టే వారు వైద్యులు

భారత వైద్య రంగంలో బిసి రాయ్ ఆదర్శప్రాయుడు

ముఖ్యమంత్రి కేసీఆర్ చర్య లతోనే తెలంగాణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

కేసీఆర్ చేపట్టిన ఆరోగ్యయజ్ఞం లో వైద్యుల పాత్ర భేష్

జాతీయ వైద్యుల దినోత్సవ వేడుక లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

ప్రజా దీవెన/సూర్యాపేట: తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడని ,బాధలనుంచి, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే వైద్యులు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రం లో బాలాజీ గార్డెన్స్, ఐఎంఏ ఫంక్షన్ హాల్లో జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,ప్రాణం పోసే వాడు దేవుడైతే.. ప్రాణాలను నిలబెట్టే వారు వైద్యులు అన్నారు.భారత వైద్య రంగంలోనూ, వ్యక్తిత్వం పరంగా భావితరాలకు బిసి రాయ్ ఆదర్శప్రాయుడు అని అన్నారు.

కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని అన్నారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కునే క్రమంలో తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి డాక్టర్‌కు, వారికి సహకరించిన కుటుంభ సభ్యులకు.. పేరు పేరునా మరోసారి మంత్రి జగదీష్ రెడ్డి అభినందనలు తెలిపారు.

రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చారని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, బస్తీ దవఖానలు, పల్లె దవఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యాధునిక సదుపాయాలతో ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్జంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషిస్తునారని అన్నారు. ప్రజారోగ్యం కోసం సీఎం కేసీఆర్ తపనకు వైద్యులు తమ కృషిని కొనసాగించాలని వైద్యుల కు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రకాల రోగ నిర్ధారణ చేసే కేంద్రాలను ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో మౌలిక వసుతులను మరింత మెరుగు పరిచామన్నారు. బస్తీ దవాఖానల ఏర్పాటుతో డాక్టర్ల సేవలను గల్లీ లోని సామాన్యుల చెంతకు చేర్చామన్నారు. డాక్టర్లతో సహా, అన్ని రకాల వైద్య సిబ్బందిని నియమించడం, ప్రమోషన్లు ఇవ్వడం, మెరుగైన రీతిలో జీత భత్యాలు పెంచడం జరిగిందని తెలిపారు.

బాధితులను ఆప్యాయంగా పలకరించి.. ప్రేమతో చికిత్స అందించడం ద్వారా సగం రోగాలు నయమవుతాయని
యువ డాక్టర్లు వైద్యాన్ని ఓ ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా తీసుకున్నప్పుడే ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని తెలిపారు. డాక్టర్ అయిన ప్రతి ఒక్కరూ రోగులకు నిస్వార్ధంగా సేవ చేయాలని ఆయన మంత్రి పిలుపు నిచ్చారు.