Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Don’t stereotype women మహిళామూర్తులపై మూస పదాలొద్దు

-- కోర్టుల్లో వాటిని అస్సలు వినియోగించవద్దు -- హ్యాండ్ బుక్ విడుదల సందర్భంగా సుప్రీంకోర్టు

మహిళామూర్తులపై మూస పదాలొద్దు

— కోర్టుల్లో వాటిని అస్సలు వినియోగించవద్దు
— హ్యాండ్ బుక్ విడుదల సందర్భంగా సుప్రీంకోర్టు

ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: దేశంలో భవిష్యత్తులో కోర్టు ఉత్తర్వులలో మహిళలపై లింగ వివక్షను ఎత్తిచూపే పదాలను వినియోగించకూడదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. మూస పదాలు (ఉంపుడుకత్తె), పదబంధాలను జాబితా చేసిన హ్యాండ్‌ బుక్‌ను సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసింది.

వాటిని వినియోగించకూడదని న్యాయమూర్తులను హెచ్చరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ హ్యాండ్‌ బుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కోర్టు తీర్పులలో మహిళలపై ఈ అనుచిత (నేరపూరితమైన) పదాలను వినియోగించారని అన్నారు.

ఈ పదాలు సరికానివి, కోర్టు తీర్పులలో మహిళలపై వినియోగించారని వ్యాఖ్యనించారు. ఈ హ్యాండ్‌ బుక్‌ ఉద్దేశం ఆ తీర్పులను విమర్శించడం లేదా వాటిని అవమానించడం కాదు. ఇటువంటి లింగ వివక్షతో కూడిన ఈ మూస పదాలు ఎలా కొనసాగుతాయో చెప్పడమే ప్రధాన ఉద్దేశం” అని అన్నారు.

ఈ పదాల అర్థాలను వివరించి ఇకపై వాటిని వినియోగించకుండా అవగాహన కల్పించడమే ఈ బుక్‌ లక్ష్యమని అన్నారు. మహిళల పట్ల మూసధోరణిలో ఉండే పదాలను న్యాయమూర్తులు గుర్తించడంలో ఈ పుస్తకం సహాయపడుతుందని అన్నారు.

ఈ హ్యాండ్‌ బుక్‌ను సుప్రీంకోర్టు వెబ్‌ సైట్‌లో కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఈ ఏడాది మార్చిలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మహిళలపై అనుచితంగా వినియోగించే మూస పదాలతో కూడిన ఓ పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.