
drdo mission swadeshi test successfull : ప్రజా దీవెన, ఒడిశా తీరం: ఆ సమ యంలో ప్రశాంతంగా ఉన్న ఒడిశా సముద్ర తీరం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్ద లైం ది. భూ మి కంపించింది… ఆకాశం వైపు దూసుకె ళ్లిన ఒక స్వదేశీ బాణం మేఘాలను చీల్చుకుంటూ వెళ్లిపోయింది. భారత రక్షణ రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే సరికొత్త అస్త్రం LRLACM (లాంగ్ రేంజ్ ల్యాండ్ ఎటాక్ క్రూయిజ్ మి స్సైల్) విజయవంతంగా నిప్పులుగక్కింది.
డిఆర్డిఓ (DRDO) శా స్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞా నంతో రూపొందించిన ఈ సుదూర క్రూయిజ్ క్షిపణి, ప్ర యో గించిన కొద్దిసేపటికే తన ప్రతాపం చూపించింది.గాల్లో రకరకాల విన్యాసాలు చేస్తూ, శత్రువుల రాడార్ల క ళ్ళుగప్పి, నిర్దేశించిన ప్రతి ఒక్క లక్ష్యాన్ని ఊహిం చని వేగం తో భస్మీపటలం చేసింది. శత్రువు ఎంత దూరం లో ఉన్నా, ఎంతటి రక్షణ వలయంలో ఉన్నా దూసుకెళ్లి మ రీ వేటాడటం దీని ప్రత్యేకత కావడం విశేషం.
సీన్ లోకి ఎంటరైన నేవీ, ఎయిర్ ఫోర్స్ బాస్‌లు
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఇండియ న్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ టా ప్ అధికా రులు అత్యంత ఆసక్తిగా వీక్షించారు. క్షిపణి సృష్టిం చిన విధ్వంసాన్ని చూసి వారు ఒక్కసారిగా మురిసి పోయా రు. ఎందుకంటే, భవిష్య త్తులో భారత త్రివిధ దళా లకు ఈ ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం ఒక తిరుగులేని బ్రహ్మాస్త్రం కాబోతున్న సందర్భం.
రక్షణ మంత్రి సెల్యూట్
ప్రయోగం సూపర్ సక్సెస్ కావ డంతో రక్షణ మంత్రి రాజ్‌నా థ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. “భారత రక్షణ రంగానికి ఇది మరో మైలురాయి. డిఆర్డిఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నా హ్యా ట్సాఫ్” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇకపై భార త సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలంటే శత్రుదేశాలు వందసా ర్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే, భారత్ లాంగ్ రేంజ్ పవ ర్ ఇప్పుడు అధికారికంగా రీలోడ్ అయిందని పరిశీలకులు భావిస్తున్నారు.




