పోలీస్ పోస్టులకు గ్రహణం
— సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్
ప్రజా దీవెన/ హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రహణం పట్టింది. తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలు తొలగించి తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
నాలుగు ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడాన్ని తప్పుబట్టిన కోర్టు మళ్లీ మూల్యాంకనం చేసిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. ఆయితే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైనల్ ఫలితాలను అక్టోబరు 4వ తేదిన TSLPRB విడుదల చేసిన విషయం విదితమే.
పోలీసు శాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 12,866 మంది పురుషులు 2,884 మంది మహిళా అభ్యర్థులు ఉన్న విషయం తెలిసింది.