El Niño Strategy Meeting : ‘ఎల్ నినో’ గండం నుండి గట్టె క్కేందుకు హై-ప్రొఫైల్ వ్యూహం, రేపు ఉదయాదిత్య భవన్‌లో మంత్రుల ఉన్నతస్థాయి సమావే శం

El Niño Strategy Meeting : ప్రజా దీవెన, నల్లగొండ: ప్ర కృతి సవాల్ విసిరితే ప్రణాళికతో తిప్పి కొట్టడమే అసలైన విజయం. ప్రస్తుత ‘ఎల్ నినో’ తీవ్రత, ఉమ్మడి నల్గొండ జిల్లా పై దాని ప్రభావం, భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర యంత్రాం గం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది. రేపు సోమ వా రం ఉదయం ఉదయాదిత్య భవన్ వేదికగా ఒక అత్యున్నత స్థాయి వ్యూహాత్మక సమీక్షా సమావేశం జరగనుంది. తెలం గాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ సంక్షేమ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరగబోయే ఈ మెగా మీటింగ్‌లో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి సహా ఉమ్మడి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎ మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన నున్నారు.
ఐదు గంటలు..3జిల్లాల భవి ష్యత్తు నివేదిక
సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గం టల వరకు (ఐదు గంటల పాటు) సుదీర్ఘంగా సాగే ఈ హై-లెవెల్ మీటింగ్‌లో చర్చించబోయే అంశాలు ఇలా ఉన్నా యి. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా వ్యవసాయ, ఉ ద్యానవన, పశుసం వర్ధక శాఖల ప్రణాళికలతో పాటు భూగ ర్భ జలాలు, తాగునీటి సర ఫరా యాజమాన్యం మరియు సాగునీటి నిర్వహణ కు సంబం ధించి, మౌలిక వసతులు ఆ రోగ్యo కరెంట్ కోతలు లేకుండా వి ద్యుత్ సరఫరా, ఎండల తీవ్రత నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖల సన్నద్ధత తదితర అంశాలపై లోతైన చర్చ జరుపనున్నారు.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ “అధికారులు కే వలం అంకెలు మోసుకురావడం కాదు… గ త ఏడాదితో పో లుస్తూ, భవిష్య త్తులో ఈ ఎల్ నినో విపత్తును ఎలా ఢీకొ ట్టాలో చూపే ‘యాక్షన్ ప్లా న్’తో కూడిన పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ (PPT) తప్పనిసరిగా సిద్ధం చేయాలని సూచించా రు.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వారీగా ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను ఈ పీపీటీల ద్వారా ప్రజాప్ర తినిధులకు వివరించనున్నారు. ఈ మేరకు ఆదివారం కలెక్ట ర్ జిల్లా అధికారు లతో అత్యవసర టెలి-కాన్ఫరెన్స్ నిర్వ హించి ఏర్పాట్లను సమీక్షించారు.
యథాతథంగా ‘ప్రజావాణి’
మంత్రుల భారీ సమీక్షా సమావేశం ఉన్నప్పటికీ, ప్రజల కో సం నిర్వహించే ప్రజావాణి కార్యక్ర మా నికి ఎలాంటి ఆటం కం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశా రు.కలెక్టరేట్ సమా వేశ మందిరం వేదికగా ప్రతి సోమవారం లాగే యథావిధిగా ప్రారంభం అవుతుండగా జిల్లా రెవె న్యూ అధికారి (DRO) ఆధ్వర్యంలో ప్రజల నుండి అర్జీలను స్వీక రిస్తారని తెలిపారు. ఈ సన్నా హక సమాలోచనల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అద నపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొని అధికారు లకు దిశా నిర్దేశం చేశారు.





