Election commissioner : ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
--పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ అప్రమత్తమవ్వండి --14 వ జాతీయ ఓటరు దినోత్సవం ర్యాలీలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
–పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ అప్రమత్తమవ్వండి
–14 వ జాతీయ ఓటరు దినోత్సవం ర్యాలీలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
ప్రజా దీవెన/ నల్లగొండ: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియో గించుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువా రం 14 వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎన్.జి. కళాశాల వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఐఏఎస్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ర్యాలీలో’నేను ఓటరుగా గర్విస్తున్నాను’ ‘నేను తప్పక ఓటు వేస్తున్నాను’ అనే ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ఎన్జీ కళాశాల వద్ద నుండి వయా రామగిరి మీదుగా క్లాక్ టవర్ వద్దకు నిర్వహించారు. అనం తరం క్లాక్ టవర్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ ర్యాలీ లో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, జడ్పీ సి. ఈ. ఓ.ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్.డి. ఓ రవి, సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మర బోయిన కేశవులు,వివిధ శాఖల జిల్లా అధికారులు, పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, ఎన్.సి.సి. ఎన్.ఎస్.ఎస్, స్కౌట్స్ విద్యార్థులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని, ప్రజలందరూ ప్రజాస్వామ్య వ్యవస్థ లో భాగస్వాములే అని అన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రతి ఓటర్ నిర్భయంగా ఓటు హక్కు విని యోగించుకునేలా ప్రశాంత, స్వేచ్చాయుత వాతావరణం లో నిష్పక్ష పాతంగా ఎన్నికలు నిర్వహించటానికి చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ బాధ్యత గా ఓటు హక్కు వినియో గించుకొని ఎన్నికల్లో ఓటు వేయాలని అన్నారు. పట్టణ ప్రాంతంలో ఓటర్ లు ఓటు వేసేలా ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కలిగించాలని అన్నారు.80 సంవత్సరములు దాటిన వయో వృద్ధులకు, దివ్యాం గులకు ఇంటి వద్ద నుండి ఓటు వేయుటకు హోం ఓటింగ్ సౌకర్యం ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఓటుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా రూపొందించిన భారత రా జ్యాంగం ద్వారా ఓటు హక్కు అవకాశం కలిగిందని తెలిపారు. ఓటర్ జాబితా లో తమ పేరు కలిగి ఉన్నారా ఓటర్ లు చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.అర్హత కలిగిన నూతనంగా ఓటర్ గా నమోదైన ప్రతి ఓటర్ కు ఫోటో ఓటర్ గుర్తింపు కార్డ్ అంద చేయడం జరుగు తుందని అన్నారు.
త్వరలో జరగనున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యు యేట్ ఎమ్మె ల్సీ ఉప ఎన్నికలో అర్హత కలిగిన పట్టభద్రులు అందరూ కొత్తగా ఓట ర్ జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రా డ్యుయేట్ ఎన్నికలలో ఓటర్ జాబితా తాజాగా రూపొందించడం జరుగుతుందని, ఇది వరకు ఓటర్ గా నమోదు అయిన వారు కూడా మళ్లీ కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకోవాలని తెలిపారు.
2023 నవంబర్ 1 కు మూడు సంవత్సరాల ముందు నవంబర్ 1 తేదీ 2020 నాటికి గ్రాడ్యుయేట్ గా ఉత్తీర్ణులై ఉండాలని, నియోజక వర్గం లో సాధారణ నివాసితు లై ఉండాలని తెలిపారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినం అయిన ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు అనిఅన్నారు.
గతం లో సమాజం లో పురుషులు,మహిళలు పట్ల తారతమ్యాలు, మహిళల పట్ల వివక్ష వుండేదని అన్నారు.భారత రాజ్యాంగం అంద రికీ సమానత్వం కల్పించిందని,.18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని, స్వీప్ ద్వారా ఓటర్ నమోదు, ఓటు హక్కు వినియోగం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.
సంవత్సరానికి నాలుగు సార్లు ఏప్రిల్ 1, జూలై1, అక్టో బర్ 1,జనవరి 1 తేదీలలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నీతి వంతమైన పాలన అందించేందుకు మంచి నాయకులకు ఆలోచించి ఓటు వేయాలని ఓటర్ లకు విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు,ఇతరత్రా ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో నూతనంగా నమోదైన యువ ఓటర్ లకు జిల్లా కలెక్టర్ ఫోటో ఓటర్ గుర్తింపు ఎపిక్ కార్డ్ లు పంపిణీ చేశారు.90 సంవత్సరం లు దాటిన వయో వృద్ధులైన ఓటర్ లను కలెక్టర్ శాలువాతో సన్మానం చేశారు.