Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Elivated corridor’s clearece Telangana government : ఎలివేటేడ్ కారిడార్లకు లైన్​ క్లియర్​

--రక్షణ శాఖ భూముల కేటాయింపులకు కేంద్రం అనుమతులు --హైదరాబాద్ రామగుండం, నాగ్ పూర్​ హైవే రూట్ క్లియర్ --ఉత్తర తెలంగాణకు విస్తరించనున్న రవాణా సదుపాయాలు --కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్​రెడ్డి కృతజ్ఞతలు

ఎలివేటేడ్ కారిడార్లకు లైన్​ క్లియర్​

–రక్షణ శాఖ భూముల కేటాయింపులకు కేంద్రం అనుమతులు

–హైదరాబాద్ రామగుండం, నాగ్ పూర్​ హైవే రూట్ క్లియర్

–ఉత్తర తెలంగాణకు విస్తరించనున్న రవాణా సదుపాయాలు

–కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్​రెడ్డి కృతజ్ఞతలు

ప్రజా దీవెన/ హైదరాబాద్: హైదరాబాద్‌‌ – కరీంనగర్ రాజీవ్ రహ దారితో పాటు హైదరాబాద్– నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివే టేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ( Permis sion of the Ministry of Defense)  ఇచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ( CM RevanthReddy)ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించా లని లేఖను అందించారు.

స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం ఉదయం అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన కారిడార్ల నిర్మాణానికి అనుమతిం చినందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండం ను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగు రోడ్డు జంక్ష‌న్ వ‌ర‌కు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల భూమి అవసరమని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి విజ్ఙ‌ప్తి చేశారు.

నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్ల‌కోయ స‌మీపంలోని ప్యార‌ డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామ‌ని, అందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భ‌విష్య‌త్తులో డ‌బుల్ డెక్క‌ర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి ముఖ్య‌ మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు.

కేంద్రం ఇచ్చిన అనుమతులతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి ( For the development of trans port routes towards North Telangana)  మార్గం సుగమమైంది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్ రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలిగిపోనుంది. హైదరాబాద్ నుంచి శామీర్పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర దిశగా అభివృద్ది పరుగులు తీయనుంది. జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి అడ్డంకిగా మారిన రక్షణ శాఖ భూముల అడ్డంకులు తొలిగిపోయాయి.

గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకార పూరిత వైఖరి తోనే ఏళ్లకేళ్లుగా ఎలివేటేడ్ కారిడార్ల అనుమతి ప్రక్రియ నిలిచిపో యింది. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరి ష్కారం లభించటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కేవ లం 80 రోజుల కొత్త ప్రభుత్వం ఈ అనుమతులు సాధించటం తమ చిత్తశుద్ధిని చాటిందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తెలంగాణ రాష్టానికి సాధించుకోవాల్సిన అవసరాల కోసం కేంద్ర మంత్రులను ( union ministers) కలిసి లేఖలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రయోజ నాల కోసం ఎవరినైనా ఎన్నిసార్లైనా కలిసేందుకు తా ము సిద్దంగా ఉన్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం తో సన్నిహిత, స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. రాజకీ య వైషమ్యాలు, పార్టీల సిద్ధాంతాలేవైనా తెలంగాణ ప్రాంత ప్రయో జనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి మరోసారి స్ప ష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు త్వరలోనే ఎలివేటే డ్ కారిడార్ నిర్మాణాలు తలపెడుతామని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం…హైదరాబాద్‌‌, కరీంనగర్ రాజీవ్ రహదారి పై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అను మతినివ్వడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎలివేటర్ కారిడార్ అనుమతి వల్ల ఎన్నో ఏళ్ళుగా హైదరాబాద్ నుం డి కరీంనగర్ వైపు వెళ్ళే ప్రయాణికులు ఎదుర్కుంటున్న తీవ్ర ఇబ్బం దులు తొలగనున్నాయనీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

డిసెంబ ర్ 15 వ తేదీన హైదరాబాద్ – కరీంనగర్ జాతీయ రహదా రుల్లో డిఫె న్స్ భూముల్లో ఎలివేటర్ కారిడార్ నిర్మించాలని అక్కడ ఎలివేటర్ కారిడార్ లేకపోవడం తో మిలట్రీ ఏరియాలో తీవ్ర ఇబ్బం దులు ఉన్నా యని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ స్పంద నగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ కి లేఖ రాశారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ – కరీంనగర్ రాజీ వ్ రహదారి పై ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం పట్ల ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎలివేటర్ కారిడార్ నిర్మాణం పూర్తయితే భవిష్యత్ లో కరీంనగర్ వైపు వెళ్ళే ప్రజలకు రాబోయే కాలంలో ప్రయాణ సమయం తగ్గడం తో పాటు అభివృద్ధి జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్  ఆకాంక్షించారు.

తెలంగాణ ఏర్పడిన సమయంలోనే ఈ ఎలివేటర్ కారిడార్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. గత ప్రభు త్వం ఈ ఎలివేటర్ కారి డార్ నిర్మా ణానికి ఎలాంటి చర్యలు తీసుకో లేదని మంత్రి పొన్నం ప్ర భాకర్  పేర్కొన్నారు.