Employeement CM RevanthReddy : నిరుద్యోగ యువతకు భరోసా
--విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణానికి అంతా సహకరించాలి --బలిదానాలు చేసుకున్న వారి ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం --119 నియోజకవర్గాల్లో మోడల్ గురుకులాల ఏర్పాటుకు యోచన --గత ప్రభుత్వం పేదలు బర్రెలు, గొర్రెలు ఇస్తే మేము ఉద్యోగాలు ఇస్తున్నాం --5,192 ఉద్యోగ నియామక పత్రాల అందజేతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నిరుద్యోగ యువతకు భరోసా
–విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణానికి అంతా సహకరించాలి
–బలిదానాలు చేసుకున్న వారి ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం
–119 నియోజకవర్గాల్లో మోడల్ గురుకులాల ఏర్పాటుకు యోచన
–గత ప్రభుత్వం పేదలు బర్రెలు, గొర్రెలు ఇస్తే మేము ఉద్యోగాలు ఇస్తున్నాం
–5,192 ఉద్యోగ నియామక పత్రాల అందజేతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన/ హైదరాబాద్: ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమం ప్రచారం కోసం కాదని, లక్షలాది మంది నిరుద్యోగులకు విశ్వాసం, నమ్మకం కల్పించడానికి చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM RevanthReddy) పేర్కొన్నారు. ఈ కార్యక్ర మం నిరుద్యోగ యవతకు స్ఫూ ర్తిని ఇచ్చేందుకు, ఆత్మహత్య లు చేసుకుంటున్న నిరుద్యోగ యువకు లకు ఒక భరోసా ఇచ్చేందుకు చేపడుతున్నామని ఆయన పునరుద్ఘాటించారు. మా ప్రభుత్వం వచ్చింది మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం నిరుద్యోగులకు కల్పించడానికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం చేపడు తున్నామన్నారు.
నూతనంగా నియమితులైన 543 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, 1,463 జూనియర్ కళాశాలల లెక్చరర్లు, 2,632 టీజీటీ ఉపాధ్యాయులు, 479 మంది కానిస్టేబుల్స్,75 మంది వైద్య సిబ్బందికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్‌బీ స్టేడియం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని, ఇదే ఎల్బీ స్టేడి యంలో 2004లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు, రైతులపై ఉన్న అక్రమ కేసులు, విద్యుత్ బకాయిలు రద్దు చేస్తూ మొదటి సంతకం చేసి మన ప్రాంతంలో రైతును రాజును చేసేందుకు పునాది వేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
2023, డిసెంబరు 7 తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో మరోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిం చిందని, అభయహస్తం పేరిట ఆరు గ్యారెంటీల అమలుకు తాను సంతకం చేశానని ముఖ్యమంత్రి తెలిపారు. మూడు నెలల కాలం లోనే ఈ స్టేడియంలోనే 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిం చే సంతకాలు పెట్టామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాడిందని, కొందరు ఆత్మబలిదానాలు చేసుకొని అమ రులై తెలంగాణ సాధించారని, త మ ఆత్మ బలిదానాలతో తమ భవిష్య త్ తరాలకు ఉద్యోగాలు వస్తా యని అమరులు నమ్మారని ముఖ్యమంత్రి అన్నారు. ఆ బలిదానా లతో సాధించిన తెలంగాణలో నాటి ప్రభుత్వం అమరుల స్ఫూ ర్తికి అనుగుణంగా పని చేయాల్సింది పోయి, వాళ్ల లాభార్జన, వారి ధన దాహం తీర్చుకోవడానికే పని చేశారని విమర్శించారు.
ఫాంహౌస్ మత్తులో ఉండిన గత పాలకులు లక్షలాది యువకుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో తల్లిదం డ్రులు రూపాయి రూపాయి కూడ బెట్టి, ఉపాధిహామీ పనులకు వెళ్లి తమ బిడ్డలను అశోక్ నగర్‌లోనో, దిల్‌సుఖ్ నగర్‌లోనో కోచింగ్ సెంటర్ల కు పంపితే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియ దని ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని, ప్రశ్నాపత్రాల దిద్ద డం సరిగా ఉండేది కాదన్నారు.
దీంతో విసిగిపోయిన నిరుద్యోగ యువత ముందుకు వచ్చి తండ్రి, కొడుకు, అల్లుడు, కుమార్తెల ఉద్యోగాలు ఊడగొట్టడంతోనే తాము అధికారంలోకి వచ్చామని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకు నియామకాలు చేపడుతు న్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా…. విద్యపై పెట్టే ఖర్చు ఖర్చు కాదని, భవిష్యత్ తరాల నిర్మాణానికి ఉపయోగపడే ఇంధ నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత నియమితులై న ఉపాధ్యాయులు తెలంగాణకు అఖిల భారత స్థాయి అధికా రులై న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ ఎస్‌లను, డాక్టర్లు, ఇంజినీర్లను తయా రు చేసే బాధ్యతను చేపట్టబోతున్నారని, సర్పంచులు మొదలు ప్ర ధానమంత్రి ( prime minister) వరకు తయారు చేసే బాధ్య త వారిపైనే ఉందన్నారు.
తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకు న్నానని, ఈ రోజు రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యానంటే నాడు ప్రభు త్వ పాఠశాలలో అందించిన విద్యనే కారణమన్నారు. తాను గుంటూరు లోనో, గుడి వాడలోనో చదువుకో లేదని, గుంటూరులోనో, గుంటూరు మరెక్కడో చదువుకున్న కొందరు తనకు ఇంగ్లిష్ రాదని అవహేళన చేస్తున్నా రని ఆయన విమర్శించారు. చైనా, జపాన్, జర్మనీలో వారికి ఇంగ్లిష్ రాదని, కానీ ప్రపంచంతోనే పోటీపడే అభివృద్ధి, ఉత్పత్తుల ను ఆయా దేశాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు.
ఇంగ్లిష్ అనేది ఓ భాష, ప్రపంచంలో ఉద్యోగం, ఉపాధి కల్పనకు ఉపయోగపడు తుందని, తమ రోజుల్లో నాడు ఉన్న అవకాశాలను పట్టి అక్కడ నేర్పిన చదువులు నేర్చుకున్నామన్నారు. నేడు ప్రపం చంలో ఉద్యోగ అవకాశా లు వచ్చే ఇంగ్లిషును ఉపాధ్యాయులు నే ర్పాలని, మీ దగ్గర చదువుకు నే పిల్లలకు ఇంగ్లిష్ రాదని అవహే ళన చేసే పరిస్థితి రావద్దని ఆయన సూచించారు. పిల్లలకు మంచి భాషను, భావాన్ని దేశభక్తిని నేర్పాలని, వారే రేపటి పాలకులు అవు తారన్నారు.
రాష్ట్రంలో గురు కు ల పాఠశాలలు ఇచ్చామని గత పాలకులు చెబు తున్నారని, వాటి లో ఎక్కడైనా మౌలిక వసతులు కల్పించారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే మోడల్ గురుకుల పాఠశాల తీసు కురావాలని కొడంగల్ నియోజకవ ర్గంలో రూ.25 ఎ కరాల్లో రూ.150 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాన్ని ఏర్పా టు చేస్తున్నా మని, 119 శాసనసభ నియోజకవ ర్గాల్లో అవకాశం ఉన్న చోట ఈ నమూనా క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తు న్నామని ఆయ న తెలిపారు. పేద విద్యార్థులంద రికి విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.
ప్రతి కిలోమీటర్‌కు సింగిల్ టీచర్ పాఠశాల, ప్రతి మూడు కిలోమీట ర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి అయిదు కిలోమీటర్లకు ప్రాథమి కొన్నత పాఠశాల, ప్రతి పది కిలో మీటర్లకు ఒక హైస్కూల్, ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇంజినీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలనే విద్యా విధానం ప్రకారం 2004 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్ ప్రభు త్వం పని చేసిందని ముఖ్య మంత్రి గుర్తు చేశారు.
గత పదేళ్లలో గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ మాత్రమే వేసిందని, 200 4 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు డీఎస్సీలు వేసి లక్ష ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి పేద పిల్లలకు విద్యను అం దించిందని ముఖ్య మంత్రి అన్నారు. గత ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట 6 వేల పాఠ శాలలను మూతవేసి దళితులు, గిరిజనులు, వెనుకబడిన ప్రాంతా ల్లోని పిల్లలకు విద్యను దూరం చేసి బర్రెలు కాసుకునే వారు బర్రెలు కాసు కోవాలె, గొర్రెలు పెంచుకునే వారు గొర్రెలు కాసుకోవాలె, చేపలు పట్టుకునే వారు చేపలు పట్టుకోవా లె అనే పథకాలు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
మన తాతలు, తండ్రులు గొర్రెలు కాస్తే, బర్రెలు కాస్తే, చెప్పులు కుడితే మన పిల్లలు అవే పనులు చేయాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం లో వారు భాగస్వాములు కావద్దా, వారు గొర్రెలు, బర్రెలు కాసుకోవాలా అని ప్రశ్నించారు. గత ముఖ్యమం త్రి మనవడు పెం చుకున్న కుక్క చనిపోతే వెటర్నరీ డాక్టర్‌పై కేసు పెట్టి లోపల వేశా రని, మరి ఉద్యో గాలు రాక వందలాది మంది విద్యా ర్థులు ఆత్మ హత్యలు చేసుకుంటుం టే వారిని (నాటి పాలకులను) ఉరి వేయా లా వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారి పెంపు డు కుక్కకున్న విలువ పేదల ప్రాణాలకు లేదా అన్నారు.
ప్యూడల్ విధానం మారాలి, పేదవాడికి విద్య చేరాలి, విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగు నింపుతుందని, చదువుతోనే మనం ఏ స్థా యికైనా ఎదగవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత న్న అంటే వెంటనే పలుకుతున్నానని, ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానని, ఇది తన తాతలు ఇచ్చిన ఆస్తి కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో మంత్రులు ఒక్కనాడైనా కలిసేవారా, ఎప్పుడై నా మీరు ముఖ్యమంత్రిని చూశా రా, కలిశారా అని ఆయన ప్రశ్నించారు.
లక్షలాది మందికి విశ్వాసం కల్పించేందుకే….ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం అంటే సామా జిక బాధ్యతను తీసుకోవడమని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నా రు. తెలంగాణ కోసం బలిదానాలు చేసు కున్న వారి ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఎటువంటి పొరపాట్లు లేకుండా అందేందుకు అధికారులు అహర్నిశలు కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. కొత్తగా ఉ ద్యోగ నియామక పత్రాలు పొందే కుటుంబాల్లోని ఆనందం రాష్ట్రం లోని నాలుగు కోట్ల మంది ప్రజలు భాగస్వాములు అయ్యేలా ఎల్‌బీ స్టేడియంలో ఈ కార్యక్రమం చేపట్టామని ముఖ్య మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమం నిరుద్యోగ యవతకు స్ఫూర్తి కావాలని, ఆత్మహత్య లు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసా ఇవ్వాలని, మా ప్రభుత్వం వచ్చింది. మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం నిరుద్యోగులకు కల్పించ డానికి నియామక పత్రాలు అందజేసే కార్య క్రమం చేపడు తున్నా మని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామన్నారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, మెగా డీఎస్సీ తో 11, 604 ఉపాధ్యాయ భర్తీలు చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆలోచన చేసి ఆశీర్వదించండి..రకరకాల వారు రకరకాల మాటాలు చెబుతున్నారని, అంతా ఆలోచన చేయాలని, ఈ ప్రభుత్వం మీ కో సం ప్రయత్నం చేస్తుందా లేదా, ఈ ప్రభుత్వం పేదల ఆలోచనలు పం చుకుంటుందా, లేదా, ప్రజలను కలుస్తుందా లేదా, ప్రజల వద్దకే పరి పాలను తెచ్చామా లేదా, గడీల్లో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాల్లోకి తెచ్చామా లేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మూడు నెలలను పరిపాలనను అంచనా చేసి భవిష్యత్‌లో తీర్పు ఇవ్వాలని, రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా, త మ పరిపాలన మీద, తమ నిర్ణయాల మీద, తాము చేస్తున్న నియా మకాల మీదనే తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు. అంతా ఆలోచన చేయాలని, ఇక్కడ విన్నది గ్రామా లకు వెళ్లి చర్చించాలని ముఖ్య మంత్రి విజ్ఞప్తి చేశారు.
తమ ప్రభుత్వం, తన మంత్రివర్గ సహచరు లు పేదలకు అండగా నిలబడాలనే ఆలోచనతో పని చేస్తున్నారని, ఇంకా చేయాలనే తపన తమకు ఉందని, అందరి ప్రోత్సాహం, పెద్దల ఆశీర్వాదం, యువ మి త్రుల సహకా రం తమకు ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాబోయే 35 ఏళ్లలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం ఉపా ధ్యాయుల చేతుల్లో నే ఉందని, ఒక మంచి సంపదను సృష్టించాల ని కోరారు. ఇవాళ యువత చాలాచోట్ల డ్రగ్స్, గంజాయి, వ్యసనాల వైపు పోతోందని, విలువ లతో కూడిన జీవితాన్ని ఎలా సాగించాలో విద్యాబుద్ధులతో పాటు సా మాజిక బాధ్యతను ఉపాధ్యా యులే నేర్పాలని ముఖ్యమంత్రి సూచించారు.
డ్రగ్స్ అనే మాట వినపడవద్దని, తెలంగాణ తులసీవ నంలో గంజా యి మొక్కలు ఉండ వద్దని వాటిని కూకటి వేళ్లతో పీకివే యాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. వ్యసనా లు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై పిల్లలకు ఉపాధ్యాయులు నేర్పించా లని ముఖ్యమంత్రి అన్నారు. 6,546 ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలనుకు న్నామని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో కొన్ని నియామక పత్రాలు ఆగాయ ని, ఈ రోజు 5,192 ఉద్యోగ నియామకాలు చేప డుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మిగతా వారికి కోడ్ పూర్తి కాగానే వారి ఇళ్లకు నియామక పత్రాలు పంపుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. విధ్వం సమైన తెలంగాణ పునర్నిర్మాణం లో అందరి సహకారం ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.