Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Environmental clearance for ‘elevations’ in good faith చిత్తశుద్ధితోనే ‘ఎత్తిపోతల’ కు పర్యావరణ అనుమతి

-- కెసీఆర్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం -- మీడియా చిట్ చాట్ లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

చిత్తశుద్ధితోనే ‘ఎత్తిపోతల’ కు పర్యావరణ అనుమతి

 

— కెసీఆర్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం
— మీడియా చిట్ చాట్ లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

 

ప్రజా దీవెన/ నల్లగొండ:పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి సాధించడం ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల తరుపున సీఎం కెసిఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

పాలమూరు క్లియరెన్స్ తో డిండి ఎత్తిపోతల పథకానికి లైన్ క్లియర్ అయినట్లేనని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లోని మొత్తం రెండు టీఎంసీ ల్లో అర టీఎంసీ నీరు డిండి ఎత్తిపోతలకు తరలిస్తారని తెలిపారు. డిండి ద్వారా నల్లగొండ జిల్లాలో 3.61లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది వివరించారు.

నార్లాపూర్ నుంచి ఎదుళ్ల అక్కడి నుంచి డిండికి గ్రావిటీ ద్వారా నీరు తేవాలని తొలి ప్రతిపాదన ఉందని, ఇటీవల వట్టెం నుంచి ఎత్తిపోతల ద్వారా తేవాలానే రెండో ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ రెండింట్లో ఎదో ఒక ప్రతిపాదన ద్వారా డిండికి నీళ్లు రావడం ఖాయమని ప్రకటించేశారు.

కల్వకుర్తి లిఫ్ట్ పథకం రీ జనరేటర్ వాటర్ ద్వారా గత మూడు నాలుగు ఏండ్లగా డిండి రిజర్వాయర్ కి వరద వచ్చి అలుగు పోస్తుందని, దీనితో డిండి కింద ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఈ అలుగు నీటితో నక్కలగండిని నింపొచ్చని, నక్కలగండి 98 శాతం పూర్తి అయినందున గేట్లు బిగిస్తే నీరు నిల్వ ఉండనుందని చెప్పారు. SLBC సొరంగమర్గం పూర్తికి టెక్నికల్ గా చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, ఆ లోపు నక్కలగండి కి డిండి రిజర్వాయర్ నుంచి నీటిని మల్లించవచ్చని తెలిపారు.ఇక డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటికే గొట్టిముక్కల 98 శాతం, కిష్టారాంపల్లి, చర్లగూడెం 70 శాతం పూర్తి అయ్యాయి.

వీటిని కూడా సహజ వరద ద్వారా కొంత నీటిని నింపొచ్చని వివరించారు. పర్యావరణ అనుమతుల నేపథ్యంలో ఈ పనులు కూడా మరింత వేగంగా పూర్తి కావచ్చనన్నారు. ఇక కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. నది జలాల పంపకం పూర్తి అయితే ఇంకా వేగంగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

శ్రీశైలంలో మరో వంద టీఎంసీ లు, సాగర్ లో మరో రెండు వందల టీఎంసీ ల నీరు వస్తే నిండనున్నాయని, అధికారులు చెపుతున్న ప్రకారం మరో 20, 30 టీఎంసీ నీరు వస్తే సాగర్ మొదటి జోన్ వరకు సాగునీరు ఇవ్వవచ్చని, ఇప్పటికే 30 టీఎంసీ ల వరకు అందుబాటులో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు సాగునీరు అడుగుతున్నారని, సెప్టెంబర్ వరకు వరదలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సాగర్ కు వరద వచ్చే అవకాశం ఉoదన్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే హక్కు లేదని, కానీ కరెంట్ ఉత్పత్తి మాత్రం చేసే హక్కు తెలంగాణ కు ఉన్నదని స్పష్టం చేశారు.