Ex minister jagadeeshReddy : అధికార మదంతో ఆటవిక ప్రవర్తన
--భువనగిరి జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి పై దాడే అందుకు తార్కాణం --పోలీసులు సైతం సందీప్ రెడ్డిని నెట్టేయ్యడం దారుణం --రాచకొండ పోలీసులపై డిజిపి చర్యలు తీసుకోవాలి --ఊడి పోయే పదవికి త్యాగాల ట్యాగ్ వేసుకుని ఊరేగుతుండు --కెసిఆర్,కేటీఆర్ ల గురుంచి మాట్లాడే నైతికత నీకు లేదు --కోమటిరెడ్డి పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు
అధికార మదంతో ఆటవిక ప్రవర్తన
–భువనగిరి జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి పై దాడే అందుకు తార్కాణం
–పోలీసులు సైతం సందీప్ రెడ్డిని నెట్టేయ్యడం దారుణం
–రాచకొండ పోలీసులపై డిజిపి చర్యలు తీసుకోవాలి
–ఊడి పోయే పదవికి త్యాగాల ట్యాగ్ వేసుకుని ఊరేగుతుండు
–కెసిఆర్,కేటీఆర్ ల గురుంచి మాట్లాడే నైతికత నీకు లేదు
–కోమటిరెడ్డి పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు
ప్రజా దీవెన/సూర్యాపేట: రాష్ట్రమంత్రి హోదాలో ఉండి ఆటవికంగా ప్రవర్తించడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కే చెల్లిందని మాజీ మంత్రి, సూ ర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశా రు. భువనగిరి జడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పై జరిగిన దాడియే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆటవిక ప్రవర్తనకు నిదర్శనమని పేర్కొన్నా రు. అధికారిక పర్యటనలో పాల్గొన్న జడ్ పి చైర్మన్ పై జరిగిన దాడి ని జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మా జీ శాసనసభ్యులు గాధ రి కిశోర్ కుమార్, రాష్ట్ర బిఆర్ యస్ కార్య దర్శి వై వెంకటేశ్వర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఆట వికంగా దాడి జరుగుతున్న ప్పుడు రక్షించాల్సిన పోలీసులే జడ్పి చైర్మన్ హోదాలో ఉన్న సందీప్ రెడ్డిని నెట్టి వేయడం దుర దృష్టకర మన్నారు.అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకో వాలని ఆయన డిజిపి ని డిమాండ్ చేశారు.
మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి సత్ప్రవర్తన తో ఉంటారనుకుంటే అందుకు భిన్నంగా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శిం చారు. అంతటి అ హంకారం ఎప్పటికీ ఆరోగ్యకరం కాదని ఆయన హితవు పలికారు. చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాప్రజలు తలకెక్కిన అహంకారాన్ని కిందకు దించుతారని ఆయన పేర్కొన్నారు. కోమటిరెడ్డి చేసిన దీక్ష తెలంగాణా కోసం ఎంత మాత్రం కానే కాదని ఆయన తేల్చిచెప్పారు.
నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిని ఖచ్చితంగా మంత్రి పదవి నుండి తొలగిస్తారని తెలుసుకునే దీక్ష జపం మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. ఊడి పోయే పదవీకి రాజీనామా చేసి తెలంగాణా కోసం రాజీనామా అన్నట్లు నమ్మ పలికే విదంగా త్యాగాల ట్యాగ్ ను పదేళ్ల నుండి మెడకేసుకుని తిరుగుతున్నాడని జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు.
వాస్తవానికి తెలంగాణా ఉద్యమ సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ బూట్లు నాకుతూ పదవులు కాపాడుకునేందుకు ప్రసన్నం చేసుకున్న చరిత్ర కోమటిరెడ్డిదని ఆయన ఘాటుగా విమర్శించారు. అంతెందుకు తాజాగా వచ్చిన మంత్రి పదవి కుడా రేవంత్ రెడ్డి బెడ్ రూమ్ లోకి పోయి కాళ్ళ మీద పడితేనే వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ల గురుంచి మాట్లాడే నైతికత కోమటిరెడ్డి కి లేదన్నారు. దివంగ త మంత్రి మాధవరెడ్డి అనుచరులకు సిగరెట్లు మోసిన చరిత్ర కోమ టిరెడ్డి దన్నారు.20 ఏండ్లుగా అధికారం లో ఉన్న కోమటిరెడ్డి జిల్లాకు ఓరగపెట్టింది ఏమి లేదన్నారు హామీల అమలుకు ప్రజలు నిలదిస్తుం టేనే అసహనంతో కోమటిరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు.
రైతు బంధు అడిగితే చెప్పులతో కొట్టండి అన్న నోరే అధికార పక్షాన్ని నిలదీస్తే తట్టుకోలేక విపక్ష ప్రజాప్రతి నిధులను నెట్టండి అంటూ పోలీసులను పురమాయించే దాకా వెళ్లింది అంటే కాంగ్రేస్ పాలన ఎటుపోతుందో అన్నది ఇట్టే తెలిసి పోతుందని ఆయన వ్యంగగా విమర్శలు సంధించారు.