Ex ministerRamreddyDamodarReddy : బ్రేకింగ్, మాజీమంత్రి, రాంరెడ్డిదామోదర్ రెడ్డి అస్తమయం, అనారోగ్యంతో ఏఐజీలో చికిత్సపొందుతూ మృతి
Ex ministerRamreddyDamodarReddy: ప్రజా దీవె న, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత ప్రాచు ర్యం పొందిన రాజకీయ నాయకు డు, మాజీ మంత్రి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అస్తమించారు. తీవ్ర అనారోగ్యం తో గతకొంత కాలంగా ఏఐజీలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాంగ్రె స్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (7 3) తుదిశ్వాస విడిచారు.
కొంతకాలంగా అ నారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉం టున్నారు. ఆరోగ్యం మరిం త ఇబ్బందికరంగా మారడంతో కుటుం బసభ్యులు ఆయనను గచ్చి బౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిoచ గా చికిత్స పొందుతూ బుధ వారం రాత్రి 10 గంటలకు దామోదర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు.
అయితే ఆయన భౌతిక కాయాన్ని గురువారం కిమ్స్ ఆస్పత్రికి తర లించనున్నారు. అనంతరం శుక్రవారం (ఈ నెల 3న) హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి తరలిస్తారు. అక్కడి నుం చి అ దే రోజు సాయంత్రం కార్యకర్తలు, ప్రజల సందర్శ నార్థం సూ ర్యపేట కు తీసుకెళ్తారు. ఈ నెల 4న సూర్యాపేట జిల్లా తుంగ తుర్తి లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, దామోదర్ రెడ్డి 1952 సె ప్టెంబరు 14న జన్మించారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సి టీలో బీఎస్సీ విద్యను పూర్తి చేశారు. వ్యవసా యం చేయడానికి ఎ క్కువగా ఆసక్తి చూపే వారు. దామోదర్రెడ్డికి మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకట రెడ్డి, గోపాల్ రెడ్డి, క్రిష్ణారెడ్డి సోదరులున్నారు. భార్య వరూధినీదేవి కొన్నేళ్ల క్రితం మరణించారు కూడా.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దామో దర్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మె ల్యేగా గెలుపొందారు. 1985, 19 89, 19 94, 2004 ఎన్నికల్లో తుం గతుర్తి ని యోజకవర్గం నుంచి ఎ మ్మెల్యేగా గెలుపొందిన దామోదర్ రెడ్డి ఆ తరువాత నియోజకవరాల పునర్వ్యవస్థీకరణతో సూర్యాపే టకు మారారు. 2009 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిం చారు. తెలం గాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా వరుసగా 2014, 2018, 20 23 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి దామోద ర్ రెడ్డి పోటీ చేశారు.
ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. 1991 నుం చి 1992 వరకు రాష్ట్ర భూగర్భ జ లవనరుల శాఖ మంత్రిగా పని చేశా రు. అనంతరం 2008 నుంచి 200 9 వరకు వైఎస్ఆర్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీ యా ల్లో దామోదర్ రెడ్డి చెరగని ముద్ర వేశారు.
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పా ర్టీలో దామోదర్ రెడ్డి మాటకు చాలా వి లువనిచ్చేవారు. అన్ని పార్టీల నా యకులు, ప్రజలు ఆయనను ‘టైగర్ దామన్న’ అని పిలిచే వారు. దామో దర్ రెడ్డి మృతి పట్ల ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్య క్తం చేశారు. దామోదర్ రెడ్డి మర ణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అ ని పేర్కొన్నారు. మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తు మ్మల నాగేశ్వర రావు తదితరులు సంతాపం వెలిబుచ్చారు.