Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

EXMinister Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యా ఖ్య, నీళ్ళు సముద్రంపాలవుతున్నా సోయిలేని జిల్లా మంత్రులు 

EXMinister Jagadish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ద్వారా వందలాది టీఎంసీల నీరు సము ద్రం పాలవుతున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సోయిలే కుం డా తిరుగుతున్నా రని మాజీమంత్రి, సూర్యాపేట ఏమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మం డిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఎంఆ ర్ పి కింద చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని గుర్తు చే శారు. మంగళవారం ఆయన నల్ల గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు వదిలేంత ఆ సక్తి జిల్లాలో రైతులకు నీళ్లు ఇద్దా మన్న కనీస ఆలోచన మంత్రులకు లేకపోవడం దురదృష్టకరమన్నా రు. పనికిరాని మాటలతో చెత్తగాళ్ళు చె త్తమాటలు మాట్లాడుతారు తప్ప రై తుల బాగోవులు చూడలేని దద్దమ్మలoటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము అధికారంలో ఉన్నప్పుడు ఎ ప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చి ఆదుకున్నా మని చెప్పారు.

చెరువులు నిండు కుండల్లాగా తల పింపచేయడం ద్వారా ప్రతి ఎకరా కు నీళ్లు ఇచ్చామని, ఏఎంఆర్ పి లిఫ్ట్ కింద ఉన్న d25, d26,d29 d31.39,40 డిస్ట్రిబ్యూటరి ల కిం ద 70 వెల ఎక రాలకు నీళ్లు అందిం చిన ఘనత మాకు మాత్రమే చెల్లు తుందని స్పష్టం చేశారు. వరుసగా 8 ఏళ్ళు నీళ్లు ఇచ్చామని, కోమటి రెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్ళీ పొలాలు ఎండిపోతున్నాయని ఆరో పించారు. హెలికాఫ్టర్ల సోకు, ఆర్భా టాలు తప్ప రైతుల మీద ప్రేమ ఏ మాత్రం లేదని విమర్శించారు.

ఒక వైపు బనకచర్లతో గోదావరి నీ టిని ఆంధ్రకు కట్టబెట్టాలాని చూస్తు న్నారని, నీళ్లు ఇవ్వమని ధర్నా చే స్తున్న రైతులపై కేస్ లు పెట్టించార ని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దందాలు, కమిషన్లు కాంట్రాక్టులు తప్ప వీళ్లకు వేరే సోయి ఉండదు ఉండబోదని ఎద్దేవా చేశారు.కనీసం ఉదయ సముద్రం నింపలేదని, ఈ ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రు లుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఇద్దరూ ఇ ద్దరేనని, వారిద్దరూ అసమర్థులే న ని, నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

కృష్ణ నది జలకళ సంతరించుకు న్నా కూడా జిల్లాలో చెరువులు ఎం డిపోయి కనిపిస్తున్నాయని, గత సంవత్సరం కూడా ఇదే విధంగా పంటలు ఎండబెట్టారని, వెంటనే పూర్తిస్థాయిలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జగదీష్ రెడ్డి, భూపాల్ రెడ్డిలు ఉదయ సముద్రం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో అందు బాటులో ఉన్న నీటి నిల్వన పరిశీలించారు. అందుబాటులో ఉన్న నీటి సామర్థ్యాన్ని మీడియాకు చూపుతూ మంత్రులపై వ్యంగ్యా స్త్రా లు సంధించారు.

నల్గొండ సాగునీటి వైఫల్యానికి కోమటి రెడ్డి వైఖరి మాత్రమే కారణ మని ధ్వజమెత్తారు. ఎవరి హ యాంలో అన్యాయం జరిగిందో చ ర్చ కు సిద్ధమా అని సవాల్ విసిరారు. మా హయాంలో అన్యాయం జ రిగిందని నిరూపిస్తే ఉదయ సము ద్రం చెరువులో దూకుతానని,
లేదంటే మంత్రి కోమటిరెడ్డి చెరువులో దూకాలని సవాల్‌ విసిరారు

నల్లగొండ ఐకాన్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ....నల్గొండ పట్టణంలో ని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ ను మం త్రి సొంత క్యాంపు ఆఫీస్ గా మార్చ డం దురదృష్టకరమన్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన నల్లగొండ గెస్ట్ హౌస్ ను యధావిధిగా ఉంచాలని, విఐపిలు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ ను ఉపయోగించుకుంటారని, అం తే కాని మంత్రి క్యాంపు ఆఫీస్ కో సం వాడుకోవద్దని, నల్గొండ ఐకాన్ భవనంగా మేము కట్టినమని, రూ. 6.25 కోట్ల నిధులు మంజూరు చే సింది కూడా తాజా మాజీ ప్రభుత్వ మేనని గుర్తు చేశారు.

మంత్రివర్గంలో కోమటిరెడ్డి కి అర్హత లేదు…కేసీఆర్ క్షుద్రపూజ లoటూ కోమటిరెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, కోమటిరెడ్డి కి మంత్రి వర్గంలో కొనసాగే అర్హత ఎంత మాత్రం లేదని దుయ్యబ ట్టారు. మంత్రినన్న కనీస సోయి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నోటికొ చ్చినట్టు మాట్లాడుతున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ఏం మా త్రం నైతికత ఉన్న కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు.

క్షుద్ర పూజలను నమ్మినా, ఆచ రించినా, ప్రచారం చేసినా చట్టరీ త్యా నేరం..ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు చేశారు అన డం ముమ్మాటికీ నేరమే అవుతుం దని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షుద్ర పూ జలు చేశారన్న మాటల్ని ఉపసం హరించుకోవాలని,ఇటువంటి పు కార్లు చెడుపోకడలు తీసుకొచ్చే సం ప్రదాయం గతంలో ఉండేవని, క్షుద్ర పూజలు చేసి ఎస్ఎల్బీసీ సొరంగం కూల్చారని మంత్రి హోదాలో ఉండి చెప్పడం సిగ్గుచేట న్నారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని, వెంటనే మంత్రి కో మటిరెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీ సుకొని మం త్రివర్గం నుంచి తొలగించి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు.

ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ క టికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ చిరా పంకజ్ యా దవ్, మాజీ ఆర్వో మాలే శరణ్య రె డ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజ న్ వలి, నల్గొండ మున్సిపల్ మాజీ ఫో ర్ లీడర్ అభిమన్యు శ్రీని వాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దే వేందర్, కనగల్ తిప్పర్తి నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, సింగిల్ విoడో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి ధోటి శ్రీనివాస్ లతో పాటు మరికొందరు పాల్గొన్నారు.

మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి, మాజీ ఎంపీపీ నారబోయినబిక్షం, సీనియర్ నాయకులు బ క్క పిచ్చయ్య, కంచనపల్లి రవీందర్ రావు, సింగం రామ్మోహన్, రావుల శ్రీనివాస్ రెడ్డి, గాదెరాంరెడ్డి, జమాల్ ఖాద్రి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, పిన్న పురెడ్డి మధుసూదన్ రెడ్డి, మె రుగు గోపి,వనపర్తి జ్యోతి, ప్రసన్న రాజ్, కందుల లక్ష్మయ్య బడుపుల శం కర్, వనపర్తి నాగేశ్వరరావు, మై నార్టీ విభాగమ అధ్యక్షులు అన్వర్ పాషా, ఊట్కూరు సందీప్ రెడ్డి, ఎ ర్రమాద వెంకటరెడ్డి, గుండెబో యిన జంగయ్య, జైపాల్ రెడ్డి దొడ్డి రమేష్ తగుళ్ళ శీను లతోపాటు పలువురు మాజీ ప్రజాప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు.