Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 3:11 am Posted by : praja deveena

Exserviceman bruthalmurder wifeshand : బిగ్ బ్రేకింగ్, రూ. 2 కోట్లబీమా కోసం స్కెచ్, సెలైన్ బాటిల్‌లో విషం కలిపి మాజీ సైనికుడి హత్య

 

Exserviceman bruthalmurder wifeshand :  ప్రజా దీ వెన, బెళగావి:దేశాన్ని కా పాడిన ఒక మాజీ సైనికుడు..కన్న వాళ్లే కాలయముళ్లవుతారని ఊ హించలేకపోయాడు. భా ర్యే కట్టు కున్నవాడి పాలిట మృత్యుపాశ మైంది. రూ. 2 కో ట్ల భారీ బీమా సొ మ్ము కోసం ప్రియుడితో కలిసి ఆమె వేసి న కిరాతక ప్లాన్, దానికి సహ కరించిన ప్రభుత్వ ల్యాబ్ అధి కారుల బాగోతాన్ని బెళగావి పోలీ సు లు రట్టు చేశారు. ఈ సంచలన కేసులో భార్యతో సహా మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్లు బెళగావి ఎస్పీ భీమా శంకర గుళేద్ వెల్లడించారు.

   ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్

యమకనమరడి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మాజీ సైని కుడు సందీప్ కలగౌడ మంజరిగి (46) మార్చి 13న జరిగిన ఒక రోడ్డు ప్ర మాదంలో గాయపడి, చికిత్స కోసం హుక్కేరి లోని ఆసుపత్రిలో చే రారు. భర్తకు సేవలు చేయాల్సిన భా ర్య సుమ, దీన్నే ఒక అవకాశం గా మార్చుకుంది. తన ప్రి యుడు పుండలీక డొంబర్‌తో కలిసి మార్చి 15న ఆసుపత్రి గదిలోనే సందీప్‌కు ఎక్కుతున్న సెలైన్ బాటిల్‌లో గు ట్టుచ ప్పుడు కాకుండా విషం కలి పింది. దీంతో సందీప్ ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదంలో తగిలి న గాయాల వల్లే ఆయ న చనిపోయాడని నమ్మించి, హడావుడిగా అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు.

 సీన్‌లోకి ఎంటరైన ‘అక్రమ’ ముఠా

కథ ఇక్కడితో అయిపోలేదు. సం దీప్ పేరు మీద ఉన్న రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే “ఇది ప్రమాదం వ ల్ల జరిగిన మరణ మే” అని నిరూపించే ఫోరెన్సిక్ రి పోర్టులు కావాలి. దీనికోసం ఈ కి లేడీ జోడీ ఏకంగా ప్రభుత్వ వ్యవ స్థలనే కొనేసింది. నకిలీ నివేదికలు సృష్టించేందుకు ఒక పెద్ద నెట్‌వర్క్‌నే రంగంలోకి దించింది.

  అరెస్ట్ అయిన నిందితులు వీరే

ఈ సంచలన కేసులో ప్రధాన నిం దితులు సుమ (భార్య), పుండలీక డొంబర్ (ప్రియుడు) తో పాటు స హకరించిన వైద్యుడు బసవరాజ భస్మె (ఆర్ఎంపీ డాక్టర్) వీరితో పా టు ప్రభుత్వ అధికారులు & సి బ్బంది అశోక గుజనాళ (బెళ గావి కమిషనర్ కార్యాలయ ఎఫ్ఏ), అ ప్పాసాహెబ నాయ క (ఫోరెన్సిక్ ల్యాబ్ క్లర్క్), అడవి స్వామిమఠ (ల్యాబ్ అసి స్టెంట్), పీఎన్ నాగ రా జ్ (సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్),
ఇతర నిందితులు సేలార, రాహు ల్ జోగి (పుండలీక స్నేహి తులు) లుగా పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేశారు.

మలుపు తిప్పిన తమ్ముడి ఫిర్యా దు

అంతా సవ్యంగా సాగిపోతోందను కున్న తరుణంలో సందీప్ సోదరు డికి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆయ న పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. యమకనమరడి పోలీసులు రంగంలోకి దిగి లోతుగా విచా రించడంతో, సెలైన్ బాటిల్ మాయా జాలం నుంచి ల్యాబ్ రి పోర్టుల ఫోర్జరీ వరకు ఉన్న ‘క్రైమ్ సిండికేట్’ గుట్టు రట్టయిం ది. ప్రస్తుతం నిందితు లందరినీ కటకటాల వెనక్కి నెట్టిన పో లీసులు, ఈ కేసులో మరిన్ని ఆ ధారాలను సేకరిస్తున్నారు.