Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Facilities for BC students are at par with SC and ST students ఎస్సి, ఎస్టీ విద్యార్థులతో సమానంగా బిసిలకు వసతులు

--34వేల మంది బిసి బిడ్డలకు చేకూరనున్న లబ్ది --బోజనం, వసతితో పాటు కాస్మెటిక్, బ్లాంకెట్లు, నోట్ బుక్స్ ఇతరత్రా సౌకర్యాలు --9 గురుకులాల నుండి 327కు పెంపు, 1,87,320మంది విద్యార్థులు --ఈనెల 28న బిసి మంత్రులు, బిసి సంఘాల నేతల సమక్షంలో జీవో, లోగో లాంచింగ్ -- సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి గంగుల కమలాకర్

ఎస్సి, ఎస్టీ విద్యార్థులతో సమానంగా బిసిలకు వసతులు

34వేల మంది బిసి బిడ్డలకు చేకూరనున్న లబ్ది
–బోజనం, వసతితో పాటు కాస్మెటిక్, బ్లాంకెట్లు, నోట్ బుక్స్ ఇతరత్రా సౌకర్యాలు
–9 గురుకులాల నుండి 327కు పెంపు, 1,87,320మంది విద్యార్థులు
–ఈనెల 28న బిసి మంత్రులు, బిసి సంఘాల నేతల సమక్షంలో జీవో, లోగో లాంచింగ్
— సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి గంగుల కమలాకర్

ప్రజా దీవెన/కరీంనగర్ : రాష్ట్రంలో బిసి విద్యా సంబందిత అంశాలైన జాతీయ సంస్థల్లో బిసి రియంబర్మంట్, పోస్ట్ మెట్రిక్ (postmetric) విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన కార్యక్రమాలకు సంబందించి జీవో (GO)విడుదల, నూతన లోగో(logo )విడుదలను ఈ నెల 28 శుక్రవారం బిసి మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి సంఘం నేతలు ఆర్  కృష్ణయ్య , జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో విడుదల చేస్తామని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) వెల్లడించారు.

విద్యనే (education)అన్నింటికి మూలమని, సామాజిక సమానత్వం విద్యతోనే సాద్యమనే గొప్ప నిర్ణయంతో ముఖ్యమంత్రి(CM)బిసిలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. తాజా గా తెలంగాణ బిసి బిడ్డలకు జాతీయ స్థాయిలోని నేషనల్ ఇన్ట్సిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ లోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ తదితర 200కు పైగా విద్యాసంస్థల్లో బిసి విద్యార్థులకు పీజు రియంబర్మెంట్ అందజేసే పథకాన్ని ప్రకటించుకున్నామన్నారు.

కరీoనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా(midia meet)సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన వర్గాల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు కేసీఆర్ సర్కార్ (kcr government) అందిస్తుందన్నారు. ప్రీమెట్రిక్ హాస్టళ్ విద్యార్థుల మాదిరే రాష్ట్రంలోని బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు సైతం సంపూర్ణ వసతులు(fesilities) కల్పిస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 34వేలకు పైగా బిసి విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి బోజన, వసతితో పాటు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ చార్జీలు, వులన్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. గతంలో బోజన, వసతి మాత్రమే అందజేసేవాళ్లమని, నేటి నిర్ణయంతో విద్యార్థులు మరింత ఉత్సాహంతో విద్యను అభ్యసించి రాష్ట్రం పేరును నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేసారు.

ఇప్పటికే బిసి గురుకులాల విద్యార్థులు రాష్ట్రం పేరును జాతీయ, అంతర్జాతీయ( international) స్థాయిలో ఘనంగా నిలుపుతున్నారని, నిన్ననే రాష్ట్ర, అంతర్జాతీయంతో పాటు జాతీయ స్థాయిలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరే బిసి విద్యార్థులకు పీజు రియంబర్మెంట్ ప్రకటించిందని గుర్తు చేశారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి. గతంలో కేవలం 19 గురుకులాల నుండి 327 గురుకులాలకు పెంచి 152 పదోతరగతి వరకూ, 142 ఇంటర్ వరకూ 33 డిగ్రీ కాలేజీలు ద్వారా 1,87,230 మంది విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య, రూ.20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్పులు (overise scholoships)  పథకాల ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతుందని కొనియాడారు.