Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Facts should be proved with current log book : కరెంటు లాగ్ బుక్ తో వాస్తవాలు నిరూపించాలి

-- ప్రజల కోసం కరెంటు తీగలు పట్టుకునేందుకు నేను సిద్ధం -- మంత్రి కేటీఆర్ కు ఎంపి కోమటిరెడ్డి సవాల్

కరెంటు లాగ్ బుక్ తో వాస్తవాలు నిరూపించాలి

— ప్రజల కోసం కరెంటు తీగలు పట్టుకునేందుకు నేను సిద్ధం
— మంత్రి కేటీఆర్ కు ఎంపి కోమటిరెడ్డి సవాల్

ప్రజా దీవెన/ యాదాద్రి భువనగిరి: నల్లగొండ జిల్లా పర్యటనలో ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరెంటు సరఫరా విషయంలో చేసిన వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిస్పందించారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ లు పెట్టి
24గంటల కరెంట్ ఇచ్చినట్లు రుజువు చేస్తే నేను కరెంట్ తీగలను పట్టుకునేందుకు సిద్దమని మంత్రి కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తినని గుర్తు చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గo లోని బిఆర్ఎస్ నాయకులు కొమ్మిశెట్టి నర్సింలు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వంగాల కృష్టయ్య , మాజీ సర్పంచ్ ఓంకార్ గౌడ్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి వాస్తవమే కానీ ఇప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని అయినప్పటికీ కేసీఆర్ బండారాన్ని మోడీ బయట పెట్టాడని, సరైనా సమయం సరైనా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరడంతో మాకేంతో బలనిచ్చారని అభినందించారు. గృహలక్ష్మీ పేరుతో రూ.3 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ దాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలన్ని ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమేనని విమర్శించారు.

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ చెప్పిన ఆరు గ్యారింటీలు చిన్న పథకాలే అయిన ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, 60 రోజులు మీరు కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించండి ఆలేరు నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని, ఆలేరు లో సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని చెప్పారు.

పార్టీలు మారితేనే పదవులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని, మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ లో తొలి జాబితా విడుదలవుతుందని తెలిపారు. యాదగిరి గుట్ట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని, అన్ని వర్గాలకు సమానంగా కాంగ్రెస్ మేనిఫేస్టో ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ డబ్బులతో పోటీ పడలేదు కానీ పథకాలతో పోటీ పడుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలు అమలవుతాయని చెప్పారు.