Farmers: ఆగమ్యగోచరంగా రాష్ట్రం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలన అగమ్యగో చరంగా తయారైందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు జి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
పంటలు ఎండిపోయి రైతుల ఆగమయ్యారు
కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు
దేవరకొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో
జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన, దేవరకొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలన అగమ్యగో చరంగా తయారైందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు జి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆగం అయ్యారని, కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పి కాంగ్రెస్ నేతలు పెద్ద మోసం చేశారని కేసీఆర్ నల్లగొండ సభలో ప్రజల ముందు పెడితే భయ పడి కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో తీ ర్మానం చేశారని పంటలు ఎండిపోతే ఎవ్వరు పట్టించుకోలేదని, కాంగ్రెస్(congress) వాళ్లు ఓట్లు దండుకొని, ఇప్పుడు మొఖం చాటేశారని ధ్వజమెత్తారు.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని టిఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తో కలిసి ప్రసంగించారు. రుణమాఫీ చేయకపోవడంతో అన్న దాతలు వడ్డీ వ్యాపారుల వద్దకు పోతున్నారని రూ. 500 బోనస్ ఇస్తాం అని మోసం చేశారని వీటన్నిటిపై కేసీఆర్ ప్రజల తరపున కొట్లాడుతున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది అన్న దాతలు ఆత్మహత్య చేసుకున్నారని అయినా ప్రభుత్వంలో కనీస చల నం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, కేసీఆర్ బయటికి రాగానే కాంగ్రెస్ వాల్ల లాగులు తడిసిపోయి కాళేశ్వ రం మోటర్లను ఆన్ చేశారని,నాగా ర్జున సాగర్ కింద నీళ్లు ఇచ్చే అవ కాశం వున్నా ఇవ్వలేదని, కోట్లాది రూపాయలు అన్నదాతలు నష్టపో యారని, మన కళ్ళ ముందే పాలేరు కి నీళ్లు తరలిపోయాయని, రండలు కాంగ్రెస్ వాళ్లు రేవంత్ రెడ్డి జేబు దొంగలాగా మాట్లాడుతున్నాడని, మంత్రులు దద్దమ్మలేనందునే కాలం తిరగబడిందని, కరువు వచ్చింది,
ఫోన్ ట్యాపింగ్ (phone tapping) , కాళేశ్వరం కుట్ర అంటూ అన్ని ఫెక్ న్యూస్ లేనని, అభూతకల్పనలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రచారo చేస్తున్నారని, కేసీఆర్ వెం ట్రుక కూడా పికలేరని ఛాలెంజ్ చేస్తూ కేసీఆర్ కాలి గోటికి కూడా కాంగ్రెస్ వాళ్లు సరిపోరని పునరుద్ఘాటించారు. ఈ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లు రవీంద్ర కుమా ర్, బిక్ష్మమయ్య గౌడ్, కంచర్ల భూ పాల్ రెడ్డి, బిఆర్ఎస్ నేత నరసిం హరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Farmers loss in Congress ruling