IndiaOpinionక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

fatal road crash in uttarakhand : బిగ్ బ్రేకింగ్, ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం, ఒకే కుటుంబoలోని ఆరుగురుదుర్మరణం

 

fatal road crash in uttarakhand :  ప్రజా దీవెన ఉత్త రాఖండ్: ఉత్త రాఖండ్ పౌరీ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు స భ్యులు ఘోర రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. పోలీ సుల కథనం ప్రకారం హరిద్వార్ జిల్లా లక్సర్ ప్రాంతానికి చెందిన అఫ్జల్ తన కుటుంబంతో కలిసి బొలెరో వా హనం లో పౌరీ గర్హ్వాల్ వైపు ప్రయాణిస్తున్నారు. వాహనం దేవప్ర యాగ్ సమీపానికి చేరు కో గానే, డ్రైవర్ అకస్మాత్తుగా వా హనంపై నియంత్రణ కోల్పోయారు. దాంతో అదుపుతప్పిన బొ లె రో క్షణాల వ్యవధిలోనే ప్రక్కనే ఉన్న లోతైన లోయ లోకి దూసుకెళ్లింది. సహాయక చర్యలు ప్రమాద సమ యం లో వాహనంలో మొ త్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. స మాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) బృందాలు ఘటనా స్థలా నికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కో ల్పోగా, ఒక బాలుడు తీవ్ర గాయా లతో ప్రాణాలతో బయట పడ్డాడు. అఫ్జల్ (49),గుఫ్రాన్ (34) అఫ్జల్ సోదరుడు,సబ్బు (40), అ ఫ్జల్ భార్య, అమన్ (14) కుమారుడు, అర్మాన్ (20 ) కుమారు డు,అనామియా (3) కుమార్తెలు మృత్యువాత ప డగా అఫ్జల్ మరో కుమారుడైన అర్హామ్ (16) తీవ్ర గాయా లతో బయటపడటంతో స్థానికులు అతడిని చికిత్స ని మి త్తం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.ముఖ్యమంత్రి ధామీ దిగ్భ్రాంతి ఈ ఘోర దుర్ఘ టనపై ఉత్తరాఖండ్ ము ఖ్య మంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. మృతుల కుటుంబ సభ్యులకు తన లోతైన సానుభూ తిని తెలియజేస్తూ, గా యపడిన బాలుడికి అత్యుత్తమ వై ద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆ దేశించారు.

  నడిరోడ్డుపైనే అనంతలోకాలకు..

మనోహరాబాద్: సొంత ఊరు వి డిచి, పొట్టకూటి కోసం వే ల కిలోమీటర్ల దూరం వచ్చిన ఆ ఇద్దరు యువకుల ప్రయా ణం విషాదాంతమైంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండ లం దండుపల్లి వద్ద శనివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఆ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. బైక్‌పై వెళ్తున్న యువకులను వెనుక నుం చి వేగంగా వచ్చిన డీసీఎం (DC M) వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ద్వి చక్రవాహనం నుజ్జునుజ్జుకాగా, ఇద్దరు యువకులు అక్కడి క క్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు బిహార్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Back to top button