Fee Concession for Journalists’ Children : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: స మాజంలో వార్తల వేటలో నిరం తరం శ్రమించే జర్నలిస్టులకు టుంబాల్లో నల్లగొండ జిల్లా వి ద్యా శాఖ సరికొత్త వెలుగులు నింపిం ది. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే పాత్రికేయుల పిల్లల చదువు లకు పెద్ద పీట వే సేందుకు నల్లగొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశే ఖర్ ఆదేశాలతో విద్యాశాఖ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీ సుకుంది. రాబోయే 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని అన్ని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో వ ర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు కనీసం 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలంటూ జిల్లా విద్యాశా ఖ అధికారి (DEO) పి. శశీo దర్ రావు సంచలన ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆ యన శని వారం టియుడబ్ల్యూజే నల్లగొండ జిల్లా అధ్యక్షు డు గుండగోని జయశంకర్ గౌడ్, జిల్లా నాయకులు ధీకొండ రవిశంకర్, నీలం వెoకటమధు, శ్రీనివాస్, శివలకు సంబం ధి త సర్కులర్ కాపీని అందజేశారు.
ప్రైవేట్ స్కూళ్లలో చదివే జర్నలిస్టుల పిల్లల ఫీజు సగానికి సగం తగ్గబోతున్న ఇది కేవలం రాయి తీ కాదు, సమాజం కోసం పనిచే సే కలాలకు దక్కిన గౌరవం అని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-1 43) నల్ల గొండ జిల్లా శాఖ ఈ స మస్యపై ప్రత్యేక చొరవ తీసుకుం ద ని జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ పేర్కొన్నారు.
జర్నలిస్టుల ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ వారు అందించి న వినతిపత్రానికి జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆమోద ముద్రతో రంగంలోకి దిగిన విద్యాశాఖ, తక్షణ మే ఈ ఆదేశా లను అమల్లోకి తెచ్చింది.
ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పీల్
ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు పా టించాలని టియు డబ్ల్యూ ఎ తరఫున అప్పీల్ చేశారు. జ ర్నలిస్టుల పిల్లలకు సాధ్యమైనంత ఎక్కువ రాయితీ ఇవ్వా లి, కానీ అది ఏ పరిస్థితిలోనూ 50 శాతానికి తగ్గ కూడదని విజ్ఞప్తి చేశారు.ఈ 2026-27 విద్యా సంవత్సరం నుం చే ఈ రూల్‌ను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొ న్నారు.
కలాలకు ఆర్థిక ఊరట
ఫీజుల భారంతో సతమతమవుతున్న పాత్రికేయ కుటుం బాలకు ఈ నిర్ణయం నిజంగానే పెద్ద ఊరట. క్షేత్రస్థాయిలో వార్తల కోసం ప రిగెత్తే జర్నలిస్టులు ఇకపై తమ పిల్లల చ దువుల గురించి నిశ్చింతగా ఉండొచ్చనే నమ్మకాన్ని ఈ ని ర్ణయం కలిగిస్తోందని, ఈ విప్లవాత్మక నిర్ణయం కేవలం ఒక జి ల్లాకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యా ప్తంగా అమలైతే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


