
Fetal road accident in Suryapet district : ప్రజా దీ వె న సూర్యాపేట: సూ ర్యాపేట జిల్లాలో తెల్లవారుజా మున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో హైదరా బాద్–విజయవాడ జాతీ య రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కంటై నర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్ర యాణికులు మృతిచెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయా లైనట్లు సమాచారం. హైద రాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ద్వారకుంట వద్దకు చేరు కున్న సమయంలో ఈ ప్ర మాదం జరిగినట్లు తెలుస్తోంది. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. పలువురు ప్ర యాణికు లు బస్సులోనే చిక్కుకుపోయారు. వారి ఆర్తనాదాలతో ప్ర మాద స్థలం విషాదంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరు కుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చి క్కు కున్న క్షతగాత్రులను రెస్క్యూ చేసి బయటకు తీసి, చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్ –విజయవాడ హైవేపై భారీగా ట్రా ఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తు న్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సూర్యాపేట జిల్లా జిల్లాలోని కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశా రు.ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ముఖ్య మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయం లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అత్యు త్తమ వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చే శారు.ప్రమాద ఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలు సుకున్న సీఎం క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పు డు పర్యవేక్షించాలని ఆదేశించారు.





