Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 1:06 pm Posted by : praja deveena

Forest officers ACB trapped : బిగ్ బ్రేకింగ్, అటవీశాఖలో ‘ఏసీబీ’ వేట, రూ.3.5లక్షలతో పట్టుబడ్డ అటవీఅధికారులు

 

Forest officers ACB trapped :  ప్రజా దీవెన, భద్రాచ లం: అడవిని కాపాడాల్సిన అధికారులే అందిన కాడికి దం డుకోవాలనుకున్నారు. రోడ్డు పనుల్లో జరిగిన చిన్న పొర పా టును సాకుగా చూపి లక్షల్లో డి మాండ్ చేశారు. చివరకు ఏ సీబీ వ్యూహానికి చిక్కి అడ్డంగా బుక్క య్యారు.చర్ల మండ లం పూసుగు ప్ప ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్న స మయంలో అనుకోకుం డా కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని పెద్దది చేసి కేసు నమోదు చేస్తామని భద్రాచలం అటవీ శా ఖ ఎఫ్.డి.ఓ (FDO) సుజాత బెదిరింపులకు దిగా రు. కేసు పెట్టకుండా ఉండాలంటే అక్షరాలా రూ. 10 లక్షలు ఇచ్చుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారుల వేధింపులు భరించలేక బాధితులు ఏసీబీని ఆశ్ర యించారు. ఈ క్రమంలో గురువారం భద్రాచలం కార్యాల యంలో రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చే శారు.ఏసీబీ డి.ఎస్పీ వై. రమే ష్ నేతృత్వంలోని బృందం ఎఫ్.డి.ఓ సుజాతతో పాటు, ఇం దులో సహకరించిన చర్ల ఇన్చార్జ్ డి.ఆర్.ఓ (DRO) కృష్ణ య్యను రెడ్ హ్యాండె డ్‌గా పట్టుకున్నారు.గతంలో కూ డా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి రూ. 3.5 ల క్ష ల లంచం తీసుకుంటూ పట్టుబడ టం గమనార్హం.

వరు సఘటనలు అటవీ శాఖలో పేరుకుపోయిన అవినీతికి అద్దం పడుతున్నాయి.డి.ఎస్పీ వై. రమేష్ బృందం ఇద్దరు అధికారులు ఎఫ్.డి.ఓ సుజాత, డి ఆర్ఓ కృష్ణయ్యల వద్ద నుంచి రూ. 3,50,000 స్వాధీన పరచుకొని ఏ సీబీ ప్రస్తుతం ఏసీబీ అధికారులు కే సు నమోదు చేసి తదుపరి విచార ణ జరుపుతున్నారు. అ టవీ శాఖలో ఈ దెబ్బతో మిగిలిన అవినీతి తిమింగలాల్లో వణుకు మొదలైంది.