Former BRS Congress drought : కరువుతో తెలంగాణ రైతు కన్నీరు
--సాగునీరు కరువై అల్లాడుతున్న తెలంగాణ రైతాంగం --సోయిలేని ప్రభుత్వానిది పూర్తి అవగాహన రాహిత్యం --పరిష్కారo ఆలోచన లేకుండా పంచాయతీలు పెడుతున్నారు --కాంగ్రెస్ అబద్ధాలు నమ్మి ప్రజలు నిండా మునిగారు --వంద రోజుల్లో వంద దోపిడీలు జరిపారు --సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పంట పొలాల సందర్శనలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
కరువుతో తెలంగాణ రైతు కన్నీరు
–సాగునీరు కరువై అల్లాడుతున్న తెలంగాణ రైతాంగం
–సోయిలేని ప్రభుత్వానిది పూర్తి అవగాహన రాహిత్యం
–పరిష్కారo ఆలోచన లేకుండా పంచాయతీలు పెడుతున్నారు
–కాంగ్రెస్ అబద్ధాలు నమ్మి ప్రజలు నిండా మునిగారు
–వంద రోజుల్లో వంద దోపిడీలు జరిపారు
–సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పంట పొలాల సందర్శనలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన/ సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న కరువుతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుoటకండ్ల జగ దీష్ రెడ్డి ( jagadeshreddy) ఆవేదన వ్యక్లం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సాగునీరు కరువై పంట చేతికి వస్తుందో లేదో అన్న ఆందో ళనతో రైతన్నలు అల్లాడుతు న్నారని ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏమాత్రం సూయి లేకుండా పూర్తిస్థాయి అవగాహన రాహిత్యంతో పరిపాలన సాగిస్తున్నాడు వల్లనే రాష్ట్రంలో ఈ పరిస్థితులుదాపు రించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రైతులకు ప్రత్యామ్నాయం చూపాలనే సోయే లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
కాళే శ్వరం ద్వారా ఎండిన పొలాలకు నీరందించే అవకాశం ఉన్నప్ప టికీ ఎన్నికల పేరుతో గాలి కుదిలేయడం బాధ్యత రాహిత్యం అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ( kaleswaram project ) పిల్లర్లు కుంగాయని కాలయాపన చేస్తు న్నారు తప్పాపరిష్కార మార్గం మాత్రం వెతకడం లేదని విమర్శిం చారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల హామీలను నమ్మి ప్రజలు నిండా మునిగారని గుర్తు చేశారు. వంద రోజుల్లో వంద దోపిడీలు జరిగాయి తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు.
రైతులకు రైతు బందు రాలేదు, రుణమాఫీ ఊసేలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ,రాష్ట్రంలో రేవంత్ (revanth re ddy) ప్రజలకు శనిలా దాపురిం చారని దుయ్యబట్టారు.తుంగతుర్తి మండలం వెలుగు పల్లి, మొండి కుంట తండా, గ్రామంలో ఎండిపో యిన పంట పొలాలను పరిశీలించి న అనంతరం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగ దీశ్ రెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ( gadari Kishore Kumar) లతో కలసి రైతుల ను వివరాలు అడిగి తెలు సుకున్నారు.
ఎస్సారెస్పీ కింద నీళ్లు ఇస్తాం పంటలు వేసుకోండని చెప్పి మరి ప్రభు త్వం రైతులను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. సూ ర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లో ఎక్కడ చూసినా ఎండిపో యిన పంట పొలాలే దర్శనమిస్తు న్నాయి. వ్యవసాయం, ప్రాజెక్టు లపై, నీళ్లపై ఈ ప్రభుత్వానికి కనీస అవ గాహన లేదని, ఎస్ ఆర్ ఎస్ పి కింద కాళేశ్వరం నీళ్లతో గడిచిన నాలుగేళ్లుగా క్రమం తప్ప కుండా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీదని గుర్తు చేశారు.
నాడు నీళ్లు అందిస్తుంటే అవి కాళేశ్వరం నీళ్లు కావని రాద్ధాం తం చేసిన కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరo నీళ్లు ఎటు పోయాయని మేము అడుగుతున్నామని, రైతులు కోట్ల రూపాయల అప్పుల్లో కురుకుపో యారని, ఆయినా ప్రభుత్వానికి సోయిలేదని ప్రశ్నించారు.ఇదికాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ద్వజమెత్తారు. రైతు ల తరఫున పేగులు తేగేదాక దాక కొట్లాడుతామని, ప్రభుత్వం మెడ లు వంచి నష్టపరిహారం అందించేంతవరకు మా పోరాటం ఆగదని, ఈ సమయంలో కూడా కాళేశ్వరం లో నీళ్లు ఎత్తి పోసి నీళ్లు అందిం చే అవకాశం వున్నా కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమ ర్శించారు.
కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బందులు పెడుతున్నా రని, జిల్లా మంత్రులు మొఖం చాటేశారని, ఎండిన పొలాల వద్దకు పోవడం లేదని, రేవంత్ బూట్లు తుడుస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తా రు. పాల కులు చేసిన పాపం వల్లనే రైతుల పొలాలు ఎండిపోయా యని, మేము గత పది రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటి స్తున్నామని, ఎక్కడికి వెళ్లినా బోరున వినిపిస్తున్నారని, చెరువులన్ని ఎండిపోయి కనీసం పశుపక్షాదులకు కూడా తాగునీరు దొరకడం లేద ని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేదని, అనేక గ్రామాల్లో మంచినీటి సమస్య కూడా ఉత్పన్నమైందని, అయినా ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, రైతుల కోసం ఎంతవరకైనా కొట్లాడు తామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కరువు పైన సర్వే చేయించి రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు..