Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 2:43 pm Posted by : praja deveena

Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యా ఖ్య, మూసీ సుందరీకరణ కాదది, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ

Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్నది అ భివృద్ధి కాదని, ఇది రే వంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ అం టూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎ మ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదలకు డబ్బుల్లేవని చెప్పే ముఖ్యమంత్రికి వందల కోట్లతో క్యాంపు ఆఫీసుల కు పైసలె క్కడివని, కేసీఆర్ మంచినీళ్లు ఇచ్చి బతుకులను నిల బెడి తే, రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వా రి జీవితాలను కూ లగొ డుతున్నా డని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రివేసే ప్రతి అడుగువెనుక భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్వ్యా పార ప్రయోజనాలే ఉన్నాయని మాజీ ఆరోపించారు. మూ సీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మా టల్లోనే.. పేదల పేండ్లను కూల్చి మెగా కృష్ణారెడ్డికి భూము లు కట్టబెట్టే కుట్ర జరు గుతోందని విమర్శించారు.డీపీఆర్ లేదు, ఎన్టీఎల్ తేలలేదు, అనుమతులు లేవు.. ఏ చట్టం ప్ర కారం ఇం డ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇస్తున్నారు? ఇం డ్లు కూల్చే బదులు నీళ్ల ట్యాంకులో విషం కలిపి చం పండి అని తల్లులు ఆవేదన చెందుతున్నా ఈ ప్రభుత్వానికి కనీస కనికరం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వా నికి మూసీ ప్రక్షాళనపై కనీ స పాలసీ, ఒక విధానం లేదు.

పూటకో తీరుగా వ్యవహరి స్తున్నా రు. మధు పార్క్ అపా ర్ట్మెంట్ కు ఇ చ్చిన నోటీసులు బేషరతుగా వెనక్కి తీసుకో వాలి. లేకపోతే బాధితు ల పక్షాన రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీ స్తమని హరీశ్ రావు హెచ్చ రించారు.