
Former Minister Jagadish Reddy: ప్రజా దీవెన, అర్వ పల్లి: ఓటర్ల జా బితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో బిఆ ర్ఎస్ బూత్ ఏజెంట్లు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిం చా లని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓ టును కాపాడటం మన బాధ్య త. దీన్ని ఒక యజ్ఞంలా భావించి ముం దుకు సాగాల్సిన అ వసరం ఉందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో జరిగిన తుంగతుర్తి ని యోజకవర్గ బిఆర్ఎస్ వి స్తృత స్థాయి సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆయన కాంగ్రెస్ ప్ర భుత్వంపై నిప్పులు చెరిగారు. కార్యకర్తల్లో జోష్ నింపుతూ ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నా యి.
ఓటర్ల సర్వే బూత్ ఏజెంట్ల బాధ్యత
బూత్ ఏజెంట్లు అందరికీ త్వరలోనే పార్టీ గుర్తింపు కార్డులు అంది స్తాం. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పార్టీకి ద్రోహం చేసినట్లే అవుతుంది.తుంగతుర్తిలో 64 శాతం మంది ప్రజ లు బి ఆర్ఎస్ వైపే ఉన్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గాదరి కిషోర్ కుమార్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ హ యాంలో గోదావరి నీళ్ల తో తుంగతుర్తిని సస్యశ్యామలం చేసి పసిడి సిరులు పండించాం. కానీ ఈ దుర్మార్గుల కాం గ్రె స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు యాసంగి సీజన్లలో తుంగతుర్తికి నీళ్లివ్వకుండా ఎండబెట్టారని దుయ్యబట్టారు.
కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు
వడ్లు కొనే దిక్కులేదు. కొనుగోలు కేంద్రాల్లోనే వడ్ల కుప్పలు తడిసిపో తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లే దు, రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేక కాంగ్రెస్ నాయకులు చాతికిలపడ్డా రు. ఇప్పుడు యూరియాతో పా టు DAP కి కూడా ‘యాప్’ పెడుతూ కొత్త కుట్రలకు తెరలేపు తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు
చంద్రబాబు, మోడీ కలయికలో వచ్చిన హైబ్రిడ్ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి. దేశంలో ఇంత పనికిమాలిన సీఎం ఎక్కడా ఉండరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నా మాట అధికారు లు వినడం లేదు, నన్ను లెక్క చేయడం లేదు’ అని ఒక ము ఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడ టానికి సిగ్గుండాలి. యూరియా కూ డా ఇవ్వలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి అం టూ విమర్శల వర్షం కురిపించారు.
జిల్లాలో ‘హెలికాప్టర్ మంత్రుల’ హంగామా
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్‌కు అసలు అవగా హనే లేదు. నీళ్లు, ఆయకట్టు, పరుగంతా అంటే ఏం టో కూడా ఆయనకు తెలియదు. రైతాంగ సమస్యలపై ఒక్క సమీక్షా సమావేశం కూ డా నిర్వహించిన దాఖలాలు లేవు. ఇక జిల్లాలో మరో మంత్రి హ్యాం (H AM) రోడ్లంటూ నానా హంగామా చేస్తున్నారు. ఇప్పుడు చివరికి గ్రామీణ రోడ్లపై కూడా టోల్ ప్లాజాలు పెట్టి ప్రజలను దోచుకోవాలని చూ స్తు న్నారన్నారుఒకప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ వద్దు, కూల గొడతాం అని ప్రగల్భా లు పలికిన ఈ దుర్మార్గులు.. ఇప్పు డు దాన్ని ప్రైవే టీకరించడానికి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
గతంలో కృష్ణా పుష్కరాల కోసం జిల్లాలో రూ. 600 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియో జకవర్గాల్లో కూడా రూపాయి తక్కువ కాకుండా అభివృద్ధి చే శామని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగా ణకు సువర్ణయుగమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే ఒ క విశ్వా సం, ఒక నమ్మకం. ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు. కేసీఆర్‌ను వదులుకుని ప్రజలంతా నష్ట పోయామని ఇప్పుడిప్పుడే గ్ర హిస్తున్నారు. ఇక్కడే కాదు, వి దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా ఇదే మాట అంటు న్నా రు. మళ్లీ వచ్చేది ఖచ్చితంగా బిఆర్ఎస్ ప్రభుత్వ మేనని ఉ ద్ఘాటించారు.
బిఎల్ఏలు,బిఎల్ఓలను నీడలా వెంబడించాలి
బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కు మార్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన గురువు చంద్ర బాబు ఎపిలో 2018లో సేవా మిత్ర యా ప్ ద్వారా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగిం చి నట్లే,బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని బిఆ ర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కు మార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజేపి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నాయ ని,ఆ రెండు పార్టీలు ఒక్కటై, తె లంగా ణలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడా లనే కుట్రతో,ఓట్లు తొలగించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎస్ఐ ఆ ర్ నిర్వహించి సుమారు 90 లక్షల ఓట్లు తొల గిం చి,మమత బెనర్జీ పా ర్టీని ఓడించారని తెలిపారు. బిజేపి అ ధికారంలోకి వచ్చాక అక్కడ తృ ణమూల్ కాంగ్రెస్ పార్టీ నా యకుల పై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. మా జీ మానవ వనరుల శా ఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరా నీ ఓటు గల్లంతయ్యిందని, బెంగళూరులో రాహుల్ ద్రావిడ్ కూడా ఓ టు విని యోగించలేకపోయారన్నారు. ఎస్ ఐఆర్ ప్రక్రియ లో ఏమరుపాటుగా ఉంటే మన ఓటు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్యుమరేషన్ ఫారం నిం పిన తర్వాత, వ్యక్తికి నోటీసు ఇవ్వ కుండా ఓటు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు, ఓటు తొలగించాలంటే ఖచ్చి తంగా నోటీసు ఇవ్వాల్సిందేనన్నారు.
అంతేకాకుండా 326 ప్రకారం ఎవరైనా వ్యక్తులు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే, రిప్రజెంటేషన్ ఈఫ్ పీపుల్ యాక్ట్ 1950 లోని సె క్షన్ 17,18 ప్రకారం ఏడాది పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. 2028లో కేసీఆర్ ని తిరిగి తెలం గాణ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే బిఎల్ఏలే ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. 18 సంవత్స రాలు నిండిన వారికి,నూతన ఓటు నమోదు చేయడానికి ఫారం 6 నింపి ఇవ్వాలని, బిజేపి,కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బిఎల్ఓ లను ప్రభావితం చేసి,దొంగ ఓట్లు వేయి స్తే,వెంటనే అధికారులకు ఫిర్యాది చేసి, ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించాలని సూచిం చారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారు, మ్యాపిం గ్ టెక్నాలజీ ఆధారం గా ఓటు నమోదు చేసుకోవాలని పే ర్కొన్నారు.
ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులున్నా, వెం టనే అభ్యంతరాలు తెలుపు తూఫారం 8 ద్వారా సరిచేసు కోవాలన్నారు. తెలంగాణలో అభివృద్ధి పథంలో నడవాలం టే,తిరిగి కేసిఆ ర్ ముఖ్య మంత్రి కావాలని,అందుకోసం ఎస్ ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఖచ్చి తంగా మన బూత్ లో ఉం డే అన్ని కుటుంబాలను కలిసి అందరి ఓట్లు నమోదయ్యేలా చూడాలని, నిరంతరం బిఎల్ఓలను వెంట ఉండి ఓట్లు పో కుండా చూడాలన్నారు.మాజీ రాజ్యసభ ఎంపి మల్లయ్య యాదవ్, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వెంకటేశ్వర్లు తదిత రులు పాల్గొన్నారు.





