Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

FormerMinisterHarishRao : మాజీ మంత్రి హరీశ్ హాట్ కామెం ట్స్, రైతులపై రేవంత్ ప్రభుత్వం కన్నెర్ర 

FormerMinisterHarishRao : ప్రజా దీవెన,హైదరాబాద్: తెలంగా ణ రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కక్ష్య తీర్చుకుం టుoదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మె ల్యే హరీశ్ రావు హాట్ హాట్ కామెం ట్స్ చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ప్రభు త్వం కన్నెర్ర చేస్తోందని ఆరోపించా రు. కాంగ్రెస్‌ నేతలకు వ్యవసాయం తో పాటు రైతుల గు రించి తెలియ దన్న హరీశ్ రావు సీఎం రేవంత్‌ రెడ్డి, నీటి పారుదల శాఖా మంత్రి ఉ త్తమ్‌కు నీటి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. ఆదివారం అయిన సిద్దిపేట లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే… బీఆ ర్ఎస్‌ నేతల మీద కోపం ఉంటే రై తులకు శిక్ష వేస్తారా అంటూ బురద రాజకీయాల కోసం వరద నీళ్లను స ముద్రంలోకి వదలకం డని హితవు పలికారు. కాళేశ్వరం కూలిందని గో బల్స్‌ ప్రచారం చేస్తున్నారని, ఉద్దేశ పూర్వకంగానే కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేయ డం లేదని, ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనుభవిస్తుం దo టూ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం పంపుల ను ఆన్ చేసి తక్షణమే రిజర్వాయ ర్లను నింపాలని డిమాండ్ చేశా రు.

ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలి, కీడు చేస్తే అది ప్రభుత్వం అనబడ దు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే, ఈ ప్రభుత్వం నీళ్ళని సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టు లను పడవు పె డుతున్నది.కడెం నుంచి ఎల్లంపల్లి కి 62 వేల క్యూ సెక్కుల నీరు వస్తుం ది. ఈ మధ్యాహ్నానికి అది లక్ష 50 వేలకు పెర గనుంది.వరద నీళ్ళు వ స్తుంటే ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నది.

నంది మేడారంలో కటక ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీ లు మిడ్ మానేర్ కు వస్తాయి.60 శాతం డ్యా మ్ లు ఖాళీగా ఉన్నవి. కాళే శ్వరం కూలిందని చెప్పి ప్రభుత్వం, నీళ్ల రాజకీయం చేస్తున్నారు. రేవంత్ కు ప్ర భుత్వం నడపడం చేతకావడం లే దు.ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వా రా నీళ్లు నింపాలి.

ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వస్తున్నది. వరద కాలువ ద్వారా అన్నపూర్ణ, మిడ్ మానేరు, ప్రాజెక్టును నింపా లి. కరెంటు ఫుల్.. నీళ్లు ఫుల్ ప్రాజెక్టు మో టార్ల స్విచ్చ్ ఆన్ చే యాలి. మోటార్లను ప్రభుత్వం ఆన్ చేయక పోతే, వేలాది మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తాము.కాంగ్రెస్ వ చ్చింది, మళ్ళీ యూరియా కోసం చె ప్పులు లైన్ పెట్టుతున్నారు. కాళేశ్వ రం పై మరో కుట్ర చేస్తున్నారు. మో టర్లను ఆన్ అండ్ ఆన్ చేయడం వలన మోటార్లు పనికి రాకుండా చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ మ ధ్య విభేదాలు ఉంటే మీలో మీరు చూసుకోండి.బి.ఆర్.ఎస్ పార్టీ వం దలాది మందితో వెళ్లి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తాము.దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్ కు నష్టం జరుగుతుంది.మంత్రులకు క మీషన్ పంచుకోవడానికి సమయం సరిపోవడం లేదని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.