Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

జమ్మూ జనాలకు ఐదేళ్లు ఉచిత రేషన్

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్క‌డి ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు.

రాష్ట్ర హోదా ఇచ్చి త్వరలో ఎన్నికలు జరుపుతాం
అరవై ఏళ్ళ సమస్యను పరిష్కరించి చూపాను
ఉద్గంపూర్‌ బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి మోదీ

 

ప్రజా దీవెన, జమ్మూ కాశ్మీర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్క‌డి ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర హోదా ల‌భించిన వెంట‌నే అసెంబ్లీ ఎన్నికలు జరగను న్నాయ ని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు భాగంగా శుక్రవారం ఉధంపూర్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్ని కల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ కు స్టార్ క్యాంపెయినర్‌ గా మోదీ ప్ర‌సంగిస్తూ నాపై విశ్వాసం ఉంచితే 60 ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని మాటఇచ్చాను. జమ్ము కశ్మీర్‌లో అమ్మలు, అక్కాచెల్లెళ్లకు గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చాను. పేద లు రోజుకు రెండు పూటల ఆహారం కోసం బాధపడకూడదని వాగ్దానం చేశాను.

నేడు జమ్మూ కశ్మీర్‌లోని లక్షలాది కుటుంబాలు రాబోయే 5 ఏళ్లపాటు ఉచిత రేషన్ పొందుతా యని వాగ్దానం చేస్తున్నాను అని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు కేవ లం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని, దేశంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు జరుగుతు న్నాయని మోదీ అన్నారు. ప్రభు త్వం స్థిరంగా ఉన్నప్పుడే సవాళ్లను అధిగమించగలమని, పనులను పూర్తి చేయగలమని అన్నారు. బలహీన కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాల పాటు ఇక్కడి షాపుర్‌ కండీ డ్యామ్‌ను ఎలా స్తంభింపజేశా యో గుర్తుండే ఉంటుందని మోదీ అన్నారు. కాంగ్రెస్ పనితీరు ఫలితం గా జమ్మూ రైతుల పొలాలు ఎండి పోయాయని, గ్రామాలు చీకటిలో మగ్గాయని మోదీ విమర్శలు గుప్పించారు. మన రావి నది నీళ్లు పాకిస్థాన్‌కు పోతుండేవని, రైతుల కు హామీ ఇచ్చిన మోదీ నిలబెట్టుకు న్నారని అన్నారు.