Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

‘Freedom’ restrictions in the city నగరంలో ‘ స్వాతంత్ర ‘ ఆంక్షలు

-- ప్రాధాన్యతాపరంగ పాసుల జారీ

నగరంలో ‘ స్వాతంత్ర ‘ ఆంక్షలు

— ప్రాధాన్యతాపరంగ పాసుల జారీ

ప్రజా దీవెన/హైదరాబాద్:హైదరాబాద్‌ నగరం లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ప్రత్యేకించి గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ఖారారు చేస్తూ గోల్కొండ పరిసరాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

వేడుకలకు వచ్చేవారు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై రూట్ మ్యాప్ ప్రకటించారు అధికారులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకూ ఉన్న రోడ్డు పూర్తి గామూసివేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు అందజేయనున్నారు.

సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతించనున్నారు.ఏ గోల్డ్ పాసులున్న వారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.ఏ పింక్ పాసులున్న వాహనదారులు కోట ప్రధాన ద్వారం నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్టాప్ వద్ద పార్క్ చేయాలి.

బీ పాసులున్న వాహనదారులు గోల్కొండ బస్టాప్ దగ్గర కుడి మలుపు తీసు కొని ఫుట్ బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.సీ గ్రీన్ పాసులున్న వాహనదారులు గోల్కొండ కోట ప్రధాన ద్వారం నుంచి 500 మీటర్ల దరంలో ఉన్న ఓసీ/ జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. డీ ఎరుపు పాసులున్న వారికి ప్రియదర్శిని స్కూల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు.

వీటికి తోడు ఈ నలుపు పాసులన్న వారు ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. షేక్ పేట, టోలీచౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజలు వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్‌కు అనుమతి ఇవ్వనున్నారు.