Full schedule again tomorrow…! రేపే మళ్లీ నిండు జాబిలి…!
-- రాఖీ పౌర్ణమి రోజే సూపర్ బ్లూ మూన్ -- ఒకే నెలలో రెండు పౌర్ణమీలు చాలా అరుదు -- మళ్ళి పదేళ్ల తర్వాత కాని రాని అవకాశం
రేపే మళ్లీ నిండు జాబిలి…!
— రాఖీ పౌర్ణమి రోజే సూపర్ బ్లూ మూన్
— ఒకే నెలలో రెండు పౌర్ణమీలు చాలా అరుదు
— మళ్ళి పదేళ్ల తర్వాత కాని రాని అవకాశం
ప్రజా దీవెన/ హైదరాబాద్: జాబిల్లి రావే చందమామ రావే అంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించే తల్లులకు చంద్రుడు కళ్ళ ముందుకు రాబోతున్నాడు. ఒకే నెలలో రెండు పౌర్ణమి రావడం చాలా అరుదైన సంఘటన అని అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడే ఈ అరుదైన సంఘటనకు సాక్షాత్కారం కాబోతుంది రాఖీ పౌర్ణమి.
రాఖీ పౌర్ణమి రోజే ఫుల్ బ్లూ మూన్ మనందరికీ దర్శనం ఇవ్వబోతుంది. ఒకే నెలలో రెండు పౌర్ణమి రావడం నిండు జాబిలి మనకు దర్శనం ఇవ్వడం అంతా సరికొత్త అనుభూతి. మళ్లీ ఇటువంటి అవకాశం ఓ పదేళ్లకు గాని రాదని ఖగోళ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.
చoదమామ చాలా అందంగా ఉంటుందని అందరికి తెలిసిందే అయినా అలాంటి చందమామ ఇంకా ఆకర్షణీయంగా, అందంగా కనువిందుచేయనుంది. అది ఎప్పుడో కాదoడి ఈ నెల 30వ తేదీ ఈ రాఖీ పౌర్ణమి రోజునే కావడం విశేషం. 2023 ఆగస్టు 30తేదీ బుధవారం రాత్రి అరుదైన సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది.
బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఫుల్ మూన్ కనిపిస్తే దానిని బ్లూ మూన్ అంటారు. ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఆగస్టు 1 వ తేదీన పౌర్ణమి రోజున పూర్తి చంద్రుడిని మనం చూశాం. ఈ విధంగా పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది.
రెండు పౌర్ణమిలు ఒకే నెలలో రావు. మళ్లీ ఇలాంటిది వచ్చేది 2037లోనేvనాసా వివరాల ప్రకారం బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలిపింది. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది.
ఫుల్ మూన్ రోజు బ్లూ సపర్ మూన్ రావడానికి 3 శాతం అవకాశం ఉంటే, పౌర్ణమి రోజులో సూపర్ మూన్ రావడానికి 25శాతం అవకాశం ఉంటుందని తెలిపింది.ఆగస్టు ౩౦ వ తేదీన వచ్చే నిండు చంద్రుడు సూపర్ మూన్ , బ్లూ మూన్ కూడా. సూపర్ మూన్ అంటే సాధారణంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కన్నా 16 శాతం కాంతి వంతంగా, సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు.
చంద్రుడు పరిభ్రమించ కక్ష్య భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, అదే సమయంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఇలా సూపర్ మూన్ కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే సూపర్ మూన్ ఈ ఏడాదిలో మూడో అతిపెద్ద సూపర్ మూన్. బుధవారం కనిపించే చందమామ చాలా కాంతివంతంగా, ఆకర్షణీయంగా, నారింజ రంగులో కనిపించబోతోంది.
ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు క్యాలెండర్ బ్లూ మూన్ ఏర్పడుతుంది. పౌర్ణమి ప్రతి 29.5 రోజులకు కనిపిస్తుంది, ఇది తప్పనిసరిగా ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు సంభవిస్తుంది. చంద్రుని దశలకు దాదాపు 29.5 రోజులు పడుతుంది, కాబట్టి ఒక సంవత్సరంలో సాధారణంగా 12 పౌర్ణమిలకు తగినంత సమయం ఉంటుంది.
కానీ కొన్నిసార్లు, ఒక సంవత్సరంలో 13వ పౌర్ణమి కూడా వస్తుంది. దానిని బ్లూ మూన్ అని పిలుస్తాము. 2023 ఆగస్టు 30 రాత్రి 8:37 గంటలకు బ్లూ మూన్ అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. బ్లూ మూన్ అమెరికా, యుకే, యూరప్‌లోని ఇతర ప్రాంతాలలో కనిపిస్తుంది, కాబట్టి భారతీయులు తమ ఫోన్‌లలో లైవ్ టెలికాస్ట్ ద్వారా మాత్రమే బ్లూ మూన్‌ను చూడగలరు.