Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Elections: గ్రాడ్యుయేట్ ఎంఎల్ సి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అశోక్ కి సంపూర్ణ మద్దతు

నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పాలకురి అశోక్ కుమార్ గౌడ్ కు బీసీ యువజన సంఘం తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ అరుణ్ గౌడ్ తెలిపారు

గ్రాడ్యుయేట్ ఎంఎల్ సి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కి సంపూర్ణ మద్దతు
బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ అరుణ్ గౌడ్

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి( Graduation MLC Election independent candidate) పాలకురి అశోక్ కుమార్ గౌడ్ కు బీసీ యువజన సంఘం తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ అరుణ్ గౌడ్ తెలిపారు.. స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని గ్రంధాలయంలో అశోక్(Ashok) సర్ ని గెలిపించాలని బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి, ఉన్నతమైన విద్యానభ్యసించి, జర్నలిస్టుగా సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం కలిగి, నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చి, నోటిఫికేషన్(Notification) ల కోసం పోరాటాలు చేశారు.

నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం అనేక ఉద్యమాలు చేశాడని,జీవో నెంబర్ 46 తొలగించాలని పోరాటం చేశాడని, ఆమరణ నిరాహారదీక్ష చేశాడని, జీవో నెంబర్ 317 తొలగించాలని ఉద్యమాలు చేశాడని, నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం చేసి జైలు జీవితం గడిపాడని,రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఖాళీలను నింపాలని, గ్రూప్-1,గ్రూప్-2,గ్రూప్-3 లలో పోస్టులు పెంచాలని చాలా ఉద్యమాలు చేసినా ప్రశ్నించే గొంతుకను శాసన మండలికి పంపించాలని, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం చట్ట సభలలో పోరాడుతాడని,మే 27 న జరిగే ఎమ్మెల్సీ(MLC Elections) ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 18 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అశోక్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నేతలు,నిరుద్యోగులు సాయి,అనురాగ్, మహేష్, చందు, మనోహర్,సాయిరామ్, నర్సింహ, స్వాతి, సునీత , నరేందర్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

Full support for MLC independent candidate Ashok