
Gandhinagar Si ACB Surprise trapped : ప్రజా దీవె న, హైదరాబాద్:చట్టాన్ని రక్షించాల్సిన చేతులే అవినీతి వై పు మొగ్గాయి. బాధితులకు అండగా నిలవాల్సిన ఖాకీ అధి కారి, లంచం కోసం కక్కుర్తి పడి చివరకు అ వి నీతి నిరోధక శాఖ(acb)వలకు చిక్కారు. హైదరాబాద్ పోలీస్ క మిషన రేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ సంచలన ఘ టన చోటుచేసుకుంది.గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (si)గా పనిచేస్తున్న వి. నర్సింహులు ఒ క కేసు వి షయమై లంచం డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ లో నమో దైన ఒక కేసులో సదరు ఫి ర్యాదుదారునికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి, అలాగే భ విష్యత్తులో ఎలాంటి వే ధింపులకు గురిచేయకుండా ఉండటానికి సదరు ఎస్ఐ ఏ కంగా రూ. 1,00,000 లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ. 50,000 ఇచ్చుకునేలా ఒప్పం దం కుదిరింది. అయితే, లంచం ఇ వ్వడం ఇష్టం లేని బాధితుడు రహస్యంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
‘రెడ్ హ్యాండెడ్’గా స్కెచ్.. సినిమా స్టైల్‌లో అరెస్ట్
పక్కాప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏ సీబీ (సిటీ రేంజ్-1) అధి కారులు మంగళవారం (23-06-2026) సాయంత్రం సుమా రు 5:30 గంటల ప్రాంతంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరి ధిలో నిఘా పెట్టారు. బాధి తుడి నుండి ఎస్ఐ నర్సింహులు రూ. 50,000 లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసీబీ అధికారు లు మెరుపు దాడి చేసి, ఆయనను రెడ్-హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద ఉన్న లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక విధిని అక్రమంగా, అవినీతితో నిర్వర్తించినందుకుగానూ ఆయన్ను వెంటనే అ రెస్ట్ చేశారు.
నిందిత అధికారి నర్సింహులును న్యాయపరమైన రిమాండ్ నిమి త్తం నాంపల్లిలోని SPE & ACB కే సుల ప్రిన్సిపల్ స్పె షల్ జడ్జి ముం దు హాజరుపరుస్తున్నారు. ఈ కే సుపై ఏసీబీ లోతైన దర్యాప్తు చే స్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా బాధి తుడి వివరాలను అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచా రు.





