OpinionPoliticsక్రైంతెలంగాణసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Ganja Chocolate Racket In Hyderabad : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్‌లో ‘స్వీట్ పాయిజన్’ కలకలం, చాక్లెట్ల ముసుగులో గంజాయి రాకెట్ గుట్టురట్టు

Ganja Chocolate Racket In Hyderabad : ప్రజా దీవె న, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో చిన్నా రుల ను టార్గెట్ చేస్తూ సాగుతున్న ప్రమాదకరమైన మత్తు దందా కు పోలీసులు చెక్ పెట్టారు. సాధారణ చాక్లెట్ల మాదిరిగా క నిపించే ప్యాకెట్లలో గంజాయినినింపి విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీ సులు రట్టు చేశారు.

మహాదేవపురంలో నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 22 కిలో ల గంజాయి కలిగిన చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసు కున్నట్లు సమాచారం. ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా తరలించి, పో లీసుల తనిఖీలకు చిక్కకుండా చాక్లెట్ రూపం లోకి మార్చి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గు ర్తించారు.

పిల్లలే టార్గెట్.. ‘స్వీట్’ ముసుగులో మత్తు

ఈ ముఠా అసలు లక్ష్యం చిన్నా రులు, పాఠశాల విద్యార్థులే నన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. రంగురంగుల ప్యాకెట్లలో సాధారణ చాక్లెట్ల మాదిరిగా కనిపించేలా తయా రు చేసి వాటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అ మాయక పిల్లల ను మత్తు పదార్థాల వైపు ఆకర్షించి, క్రమం గా వ్యసనానికి బానిస లుగా మార్చే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

  రంగంలోకి SOT నిందితులు అదుపులోకి

సమాచారం అందుకున్న SOT పోలీసులు ప్రత్యేకంగా నిఘా పె ట్టి దాడులు నిర్వహించారు. భా రీగా ఉన్న మత్తు పదా ర్థాలను సీజ్ చేసి, ఈ అక్రమ రాకెట్‌తో సంబంధం ఉన్న ప్ర ధాన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? నగరంలో ఎక్కడెక్కడికి సరఫరా చే స్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తు న్నారు.

తల్లిదండ్రులకు పోలీసుల కీలక హెచ్చరిక

అపరిచిత వ్యక్తుల నుంచి పిల్లలు చాక్లెట్లు, స్వీట్లు, ఇతర తి నుబండారాలు తీసుకోకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అను మానాస్పద ప్యా కెట్లు లేదా మ త్తు పదార్థాల విక్రయంపై సమా చారం ఉంటే వెంటనే పోలీసుల కు తెలియజేయాలని కోరారు.చిన్నారుల భద్రత కోసం ప్రతి త ల్లిదండ్రి అప్రమత్తంగా ఉండాల్సిన అవ సరాన్ని ఈ ఘటన మరో సారి గుర్తుచేస్తోంది.

Related Articles

Back to top button