బిగ్ బ్రేకింగ్, గిగ్ వర్కర్లకు తీపికబురు, తెలంగాణ గిగ్ అం డ్ ప్లాట్ ఫాం వర్కర్స్ బిల్లుకు గవర్నర్ అధికారిక ముద్ర
Gig Workers bill good news : ప్రజా దీవెన, హైదరా బా ద్: తెలం గాణలోని లక్షలాది మంది గిగ్ వ ర్కర్ల (డెలివరీ ఏ జెంట్స్, క్యాబ్ డ్రైవర్లు) జీవితాల్లో కొత్త వెలుగులు నింపు తూ తెలంగాణ గిగ్ అం డ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ బిల్లు 2026 కు గవర్నర్ అధికారిక ముద్ర వేశా రు. కేవలం ఒక వృత్తిగా మాత్రమే కాకుండా వీరికి సామాజిక భద్రత కల్పించే దిశగా ఈ చట్టం దేశానికే ఆదర్శంగా నిలవనుంది. తెలంగాణ ప్రభు త్వం ఈ మేరకు గిగ్ వర్క ర్లకు తీపి కబురు అందించింది.ఈ చట్టం అమల్లోకి రావడంతో గిగ్ వ ర్కర్లకు అందబోయే ప్రధా న ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
భరోసా’ ఇచ్చే చట్టబద్ధ రక్షణ
ఇప్పటివరకు అసంఘటిత రంగంగా ఉన్న గిగ్ ఎకానమీకి ఇప్పుడు ఒక స్పష్టమైన గుర్తింపు లభించింది. ప్లాట్‌ఫాం కం పెనీల ఇష్టాను సా రంగా కాకుండా, ప్రభుత్వ నిబంధనల ప్ర కారం కార్మికుల హక్కులను కాపాడటం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా ప్రతి గిగ్ వర్కర్‌కు ఒక ప్రత్యేక గు ర్తింపు కార్డు కేటాయించబడుతుంది. దీనివల్ల ప్ర భుత్వ సంక్షేమ పథ కాలు నేరుగా వర్కర్‌కు అందుతా యి. ఏ ప్లాట్‌ఫాం (Zomato, Swi ggy, Ola, Uber మొదలైనవి) మా రినా వారి వివరాలు భద్రంగా ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సంక్షే మ బోర్డును ఏర్పాటు చేస్తోంది. దీనికి నిధులు ఎలా వస్తాయంటే
అగ్రిగేటర్ల సహకారం : ప్రతి లావాదేవీపై 1% నుండి 2% వ రకు అ గ్రిగేటర్లు (కంపెనీలు) ఈ నిధికి జమ చేయాలి. త ద్వారా ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, ప్రసూతి సౌకర్యాలు మరియు పెన్షన్ వంటి స దుపాయాలు ఈ నిధి ద్వారా కల్పి స్తారు.కార్మికులను అన్యాయంగా తొలగించినా లేదా పేమెం ట్లలో ఇ బ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేయడానికి ఇప్పు డు ఒక పటిష్టమై న వ్యవస్థ సిద్ధమైంది. తగిన కారణం లే కుండా ఏ వర్కర్‌ను తొలగించడానికి వీల్లేదు. కనీసం 7 రో జుల ముందుగా సమాచారం ఇవ్వాలి.
ఆర్డర్ కేటాయింపులు మరియు రే టింగ్స్ విషయంలో కం పెనీల అల్గా రిథమ్స్ పారదర్శకంగా ఉండాలి లబ్ధిదారులు గా డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు ఉంటారు. పేమెంట్లు, పెనాల్టీల లెక్కలు స్పష్టంగా ఉండాలి. నిబంధన లు ఉ ల్లంఘించే కంపెనీలకు భారీ జరి మానాలు విధించే అ వకాశం ఉంటుంది. ప్రభుత్వం, కార్మికులు, కంపెనీ ప్రతినిధు లతో కూడిన బోర్డు. ఇది కేవలం ఒక బిల్లు కాదు, రోడ్లపై ఎం డనక, వాననక శ్రమిస్తున్న లక్ష లాది మంది కార్మికుల ఆత్మ గౌరవ ప్రయాణంలో ఒక మైలురాయి.”తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్ల కుటుం బాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడటమే కాకుండా వారి భవిష్యత్తుకు ధీమా ల భించిందని చెప్పవచ్చు.