Goafireaccident: ప్రజా దీవెన, గోవా: దేశంలో మరోమారు భారీ దుర్ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి గోవా లోని ఒక క్లబ్‌లో జరిగిన ఘోర భారీ అగ్నిప్రమాదంలో 23 మంది ప్రాణాలు కో ల్పోయారు. ప్రాథమిక నివేదికల ప్రకారం గ్యాస్ సిలిండర్ లీకేజీ కా రణంగా మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించిందని తెలు స్తోంది. ప్రమాదం తీవ్రతకు భవనం పూర్తిగా కుప్పకూలిపోవడంతో, శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయడం సహా యక బృందాలకు ఆటంకం ఏర్పడిoది.
అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో, క్లబ్‌లో ఉన్న చా లా మంది నిద్రిస్తున్నారని లేదా అప్రమత్తంగా లేరని భావిస్తు న్నారు, ఇది మృతుల సంఖ్య పెరగడానికి ఒక కారణం కావచ్చని అధికా రు లు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మరియు రెస్క్యూ బృందాలు రాత్రంతా అవిశ్రాంతంగా శ్రమించి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాయి.
సంఘటన పూర్తి వివరాలు…గోవాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్పోరా గ్రామంలో ఉన్న ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలడంతో 23 మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలా న్ని ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ పరిశీలించారు. మృతు ల్లో నలుగురు పర్యటకులు ఉండగా, మిగతావారంతా క్లబ్ సిబ్బం దిగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో ముగ్గురు సజీవద హనమ వగా, 20 మంది ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపా రు. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరం లో ఉంది. మరిన్ని పూర్తి వివరాలు అందాల్సి ఉంది.