భద్రాద్రిలో గోదావరి ఉధృతి..!
ప్రజా దీవెన/కొత్తగూడెం: ఉత్తర భారత దేశంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి (godavari ) లో నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం క్రమ క్రమంగా అధికమవుతోంది.
దీంతో శుక్రవారం భద్రాద్రిలో గోదావరి నీటి మట్టం 18.3 అడుగులకు చేరడం గమనార్హం. గోదావరి నదికి వరద ఉదృతి పెరగడంతో అధికారులు అప్రమత్తం(alert) అయ్యారు. సాయంత్రానికి వరద ప్రవాహం మరితం పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.