Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Market value of land: సవరణల సమయం ‘భూ’ మదింపుకు సన్నద్ధం

రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టి వనరుల సంస్కరణలకు మరో మారు సమయం ఆసన్నమైంది. వరుస ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ సమ కూర్చుకునే పనిలో పడ్డారు.

భూముల మార్కెట్ విలువ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం
రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూ టీల పెంపుకు కూడా ఆదేశం
ఆన్ని రకాలచార్జీలను శాస్త్రీయం గా నిర్ధారించాలని నిర్దేశం –సమన్వయంతో సమర్థవంతంగా ఆదాయం పెంచాల్సిన అవసరం
రాబడుల శాఖల అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టి వనరుల సంస్కరణలకు మరో మారు సమయం ఆసన్నమైంది. వరుస ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Anumula Revanth Reddy) ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్(Budget) సమ కూర్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని భూముల ధరలను మరింపు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రా నికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపు లు-రిజిస్ట్రేషన్లు, ఎరైజ్, మైనింగ్(Trade taxes, stamp-registrations, erect, mining) విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమా వేశమయ్యారు.

ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు(Market values ​​of lands),  రిజిస్ట్రేషన్ చార్జీలు( registration charges), స్టాంపు డ్యూ టీల(stamp duty),పై చర్చ జరిగింది. హైదరాబాద్ పాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ, అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు. చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేక పోవ టం ప్రధాన కారణమని అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో గత ప్రభు త్వం 2021లో భూముల విలువ ను, రిజిస్ట్రే షన్ చార్జీలను పెంచిం ది.

ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉంది. నిబంధ నల ప్రకారం ఏటా భూముల మార్కె ట్ విలువను సవరించాల్సి ఉంటుం ది. ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టండని అధికారులను ముఖ్య మంత్రి ఆదేశించారు. ఎక్కడెక్కడ, ఏయే ప్రాంతాల్లో ధరలను సవరిం చాలో వ్యవసాయ భూములు, ఖా ళీ స్థలాలు, ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌ మెంట్లలోని ఫ్లాట్లు ఇలా వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, ఈ విష యం లో రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనలను పక్కాగా పాటించాలని నిర్దేశించా రు. రాష్ట్ర రాబడి పెంపుతోపాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్స హించేందుకు వీలుగా భూముల మార్కెట్‌ ధరల సవరణ జరగాలని సూచించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర స్టాంప్‌ డ్యూటీ(stamp duty) ఎంత ఉందో పరిశీలించాలని, దీనిని తగ్గించాలా, పెంచాలా, అనే దానిని అధ్యయనం చేయాలని ఆదేశించా రు. సామాన్యులకు, చిన్న నిర్మాణా లకు ఇసుక కొరత రాకుండా చూడా లని, ఇసుక ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరిక ట్టాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా గతేడాది వచ్చిన ఆదా యం ఆశాజనకంగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీ క్షించుకోవాలంటూ అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్‌లో పొందుపర్చిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెల నెలా టార్గెట్‌ను నిర్దేశించుకుని రాబడిని సాధిం చేందుకు కృషి చేయాలని నిర్దేశిం చారు.

జీఎస్టీ ఎగవేతదారులపై చర్యలు.. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చి పెట్టే జీఎస్టీలో ఎగవే తలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు పక్కాగా ఫీల్డ్‌ ఇన్‌ స్పెక్షన్‌, ఆడిటింగ్‌ జరగాలని, జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని తేల్చి చెప్పా రు. వాణిజ్య పన్నుల శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కారాదని, జీఎస్టీ రిటర్న్స్‌ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి, అక్రమాలకు తావు లేకుం డా వ్యవహరించాలని అధికారుల ను హెచ్చరించారు. గత ఆర్థిక సంవ త్సరంలో ఎన్నికల సీజన్‌లో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలను సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణా, పన్ను ఎగవేతలు లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని, శాఖాపరమైన లొసుగులు లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దు బాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికీ చాలా చోట్ల కార్యాలయాలు అద్దె భవ నాల్లో ఉన్నాయని, రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్లు చెట్ల కింద నిలబడే ఉంటున్నారనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. దాంతో, ప్రజోప యోగానికి సేక రించిన స్థలాలను గుర్తించి వాటిలో కొన్నిచోట్ల అధునా తనంగా మోడల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనాలను నిర్మించాల ని, అందుకు సన్నాహాలు చేయా లని సీఎం చెప్పారు.

Government increase market value of land