
Gujarat horrific buses accident : ప్రజా దీవెన, గుజరా త్: అది ఎప్ప టిలాగే సాగిపోతున్న సాయంత్రం వేళ ప్రయా ణికులు తమ గమ్యస్థా నాలకు చేరుకునే తొందరలో ఉ న్నా రు. కానీ, విధి మరోలా తలచిం ది. సూరత్ జిల్లా బార్డోలీ సమీపం లోని జాతీయ రహదారిపై ఒక్కసా రిగా భారీ శబ్దం ఆ వెంటనే ఆకా శా న్నంటిన మంటలు ఆ ప్రాంతాన్ని శ్మశా నంగా మార్చేశాయి. రెండు భారీ బస్సులు ముఖాముఖి ఢీకొన్న ఈ ఘోర ప్రమాదంలో క్షణాల వ్యవధిలోనే ఏడుగు రు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవద హనమ య్యారు.
తాజాగా జరిగిన ఈ ఘోర దుర్ఘటన పూర్వా పరాలు ఇలా ఉన్నాయి.రెండు ఆర్టీసీ బస్సులు వేగంగా ప్ర యాణిస్తూ ఊ వా-మానెక్పూర్ గ్రా మాల మధ్య ఒకదానికొకటి బలం గా ఢీకొన్నాయి. ఢీకొన్న వేగానికి ఒ క బస్సు రోడ్డు పక్కన ఉన్న లోత ట్టు ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో షార్ట్ సర్క్యూట్ సంభవిం చి, ట్యాంక్ పగిలిపోవడంతో క్షణా ల్లో మంటలు చెలరేగాయి. బస్సు లోపల నిద్రిస్తున్న, కోలుకోలేని స్థి తిలో ఉన్న ప్రయా ణికులు బయట పడేందుకు కూడా అవకాశం లేకుండా పో యింది. కళ్లముందే మంట లు వ్యాపించడంతో ఏడుగురు ప్ర యాణికులు అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు.
ప్రమాద సమయంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వ చ్చింది. మేం పరుగెత్తుకుంటూ వెళ్లేసరికే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. కి టికీలు పగలగొట్టి కొందరిని రక్షించ గలిగామని ప్రత్యక్ష సాక్షులైన స్థా ని కులు తెలిపారు. కానీ కొందరిని కా పాడలేకపోయాం” అంటూ స్థానికులు కన్నీ రు మున్నీరయ్యారు. ఘ ట నా స్థలంలో భీతావహ వాతావర ణం చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థా యిలో ఉందో చెప్పడానికి కూడా మనసు రావడంలేదని వారు పే ర్కొన్నారు.
ఈ ప్రమాదంలో 7 గురు సజీవద హనం కాగా 40 మందికి పైగా క్షతగాత్రులు కావడంతో బార్డోలీ, సూరత్ ప్రభుత్వ ఆ సుపత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రత కారణంగా మృ తుల సంఖ్య ఇంకా పెరి గే అవకాశం ఉందని పోలీసు లు వె ల్లడిస్తున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసు లు మరియు ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది యు ద్ధ ప్రాతిపదికన రం గంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చి, బస్సు అద్దాలు పగలగొట్టి తీవ్రంగా గాయపడిన దాదాపు 40 మం దికి పైగా ప్రయాణికులను రక్షించారు.
క్షతగాత్రులను వెంట నే చికిత్స ని మిత్తం సమీపంలోని ఆ సుపత్రులకు తరలిం చారు. వీరిలో పలువురి పరిస్థితి అ త్యంత విషమంగా ఉం డటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిం ది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నా రు.




