OpinionPoliticsజాతీయంతెలంగాణసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Gutha Sukender Reddy : బిగ్ బ్రేకింగ్, శాసన మండలి చై ర్మన్ సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్య,క్యాబినెట్ షప్లింగ్ చే యాలి

--సీఎం రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వాలి,ఆటంకాలు సృష్టించొద్దు --పార్టీలో గ్రూపు తగాదాలు తగ్గా లి,క్రమశిక్షణ తప్పనిసరి --22ఏ రద్దు చేయాలి, ఉచితాలను తగ్గించాలి

Gutha Sukender Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తె లంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మా రాయి. తెలంగాణ శాసన మండలి లోని తన ఛాంబర్‌లో ని ర్వహించిన మీడియా చిట్‌ చాట్‌లో ఆయన ప్రభుత్వం, కాం గ్రెస్ పార్టీ, మంత్రివర్గ పున ర్వ్యవస్థీకరణ, సంక్షేమ పథకాలు తదితర అంశలపై తన అ భిప్రాయాలను వెల్లడించారు. ప్ర భుత్వం ఏర్పడి ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తయ్యాయని,ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేపట్టాల్సిన అవ స రం ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తు తం ఉన్న క్యాబినెట్‌ను ష ప్లింగ్ చేస్తే ప్రభుత్వంలో కొత్తతనం వస్తుందని సూచించారు.క్యాబినెట్‌లో మార్పుతో పాటు ప్ర భుత్వ పనితీ రులోనూ కొత్త ఊపు రావాల్సిన అవసరం ఉం దన్నారు.

కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు తగ్గాలి

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలను తగ్గించాల్సిన అవసరం ఉందని గుత్తా పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటిన వారిపై చర్య లు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చ రిం చారు. పార్టీలో లీకేజీలను నియంత్రించాలని, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ అంశాల న్నింటినీ నియంత్రిస్తే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అ వకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

    సీఎం రేవంత్‌కు స్వేచ్ఛ ఇవ్వాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూ డా గుత్తా కీలక వ్యాఖ్యలు చేశా రు. రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని పే ర్కొంటూ.. ఆయనకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించా లని అన్నా రు. సీఎంకు ఆటంకాలు సృష్టించొద్దు.. అందరూ సహకరించాలి. ముఖ్యమంత్రికి స్వేచ్ఛ ఉండాలని గుత్తా సు ఖేందర్ రెడ్డి సూచించారు.అదే సమయంలో చిన్నారెడ్డి బ హిరంగంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని వ్యాఖ్యా నించారు.

పెన్షన్లు పెంచాలి.. రైతు భరోసా కొనసాగాలి

ప్రస్తుతం ఉన్న పెన్షన్లను మరో రూ.2 వేల మేర పెంచాలని గుత్తా సూచించారు. రైతు భరోసా పథకాన్ని కొనసాగించా లని అయితే అర్హులైన రైతులకు మాత్రమే ప్రయోజనం అం దేలా చూడాలని అన్నారు.ఉచిత పథకాలను త గ్గించాలని, నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అం దించా లని అభిప్రాయపడ్డారు. బీపీఎల్, ఏపీఎల్ అంశాలపై తాను గతంలో సూచనలు చేసినప్పటికీ వాటిని పట్టించుకోలేదని తెలిపా రు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22ఏ అంశం ఉందని పేర్కొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి 22ఏను రద్దు చేయా ల్సిన అవసరం ఉం దని అభిప్రాయపడ్డారు. అలాగే ఉద్య మకారులకు న్యాయం చే యాలని ప్రభుత్వానికి సూచిం చా రు.

కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కొనసాగిస్తోంది

కేసీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని పథకా లను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగి స్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పాత పథకాలను అమ లు చేస్తూనే కొత్త పథకాలను కూడా ప్రభు త్వం తీసుకొచ్చిందని పే ర్కొన్నారు.ప్రభుత్వం అమలు చే స్తున్న పథకాలపై సామాన్య ప్రజ ల్లో పెద్దగా అసంతృప్తి లేద ని ఆ యన అభిప్రాయపడ్డారు. ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మరిం త ప్రచారం చేయాలని సూచించా రు. మొత్తంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాం గ్రెస్‌లో చర్చకు దారితీసే లా మారాయి. ముఖ్యంగా క్యాబినెట్ షప్లింగ్, పార్టీ క్రమశిక్ష ణ, సీఎం స్వేచ్ఛ, 22ఏ రద్దు వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

Related Articles

Back to top button