Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 1:49 pm Posted by : praja deveena

Hanumakonda woman murder : బిగ్ బ్రేకింగ్, హనుమకొండలో దారుణం, కాళ్లు చేతులు కట్టేసి, భార్య గొంతుకోసి హత్య

Hanumakonda woman murder : ప్రజా దీవెన హన్మ కొండ:ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇద్దరు పిల్లల తో హ్యాపీగా సాగిపోతుందనుకు న్న కాపురం అర్ధరాత్రి దారుణ హత్యతో ముగిసింది. హనుమ కొండ 4వ డివిజన్ కృష్ణ కాలనీలో శని వారం రాత్రి చోటుచేసుకు న్న ఈ కిరాతక ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకె త్తించింది. నిందితుడు (వృత్తి రి త్యా మేస్త్రీ) తన భార్య కాళ్లు, చేతులు కట్టేసి, అత్యంత క్రూ రంగా మెడ కోసి హత్య చేశాడు. సుమారు ఆరు సంవత్సరా ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చే సుకున్నారు. వీరికి ఇద్ద రు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

  కుటుంబ కలహాలే కారణమా?

కొంతకాలంగా ఈ దంపతుల మధ్య తీవ్ర కుటుంబ కలహాలు న డుస్తున్నాయని, ఆ గొడవలే ఈ దారుణానికి దారితీసి ఉండవచ్చని స్థానికులు బాహాటంగానే చెబుతున్నారు. స మాచారం అందు కున్న వెంటనే కాకతీయ యూనివర్సిటీ (KU) పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌ తో ఆధారాలు సేకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తర లిం చారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

   పోలీసుల అనేక అనుమానాలు

కేవలం కుటుంబ తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమా? లేక దీని వెనుక మరేదైనా బలమైన కోణం ఉందా? అనే కో ణంలో పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. పసిపిల్లల ను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి కన్నుమూయడం, తండ్రి జైలు పాలయ్యే పరిస్థితి రావడంతో ఆ ఇద్దరు చి న్నా రుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.