Hanuman Jayanti : భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు
హనుమాన్ జయంతిని(Hanuman Jayanti) పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో శనివారం తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆకు పూజ, విశేషా అలంకరణ, నీరాజనా మంత్రపుష్పాలు, హనుమాన్ హోమం, పూర్ణాహుతి, తిరొక్క పూలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజా దీవెన, కోదాడ: హనుమాన్ జయంతిని(Hanuman Jayanti) పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో శనివారం తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆకు పూజ, విశేషా అలంకరణ, నీరాజనా మంత్రపుష్పాలు, హనుమాన్ హోమం, పూర్ణాహుతి, తిరొక్క పూలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని , వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఉన్న హనుమాన్ ఆలయం,బాలాజీ నగర్ లో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం,శ్రీరంగాపురం లో గల ఆంజనేయ(Anjaneya swamy) స్వామి దేవాలయం, కోదండ రామాలయంలో తమ్మరగబండపాలెం సీతారామచంద్ర స్వామి దేవాలయంలో, హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కనుల పండువగా నిర్వహించారు.
కాగా భక్తులు(Devotees) అధిక సంఖ్యలో పాల్గొని. జైశ్రీరామ్(Jai sriram), జై హనుమాన్(Jai Hanuman), రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ జై ఆంజనేయ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి.అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జూకూరి అంజయ్య, దేవరశెట్టి హనుమంతరావు, బాలాజీ నగర్ ఆంజనేయ స్వామి అర్చకులు, అరుణ్ కుమార్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Hanuman Jayanti celebrations