Happy hour for RTC employees: ఆర్టీసీ ఉద్యోగులకు ఆనంద సమయం
-- ఒకేసారి 9 డిఏలు మంజూరుకు సంస్ధ నిర్ణయం -- తొందరగా చెలించాలంటున్న ఉద్యోగులు
ఆర్టీసీ ఉద్యోగులకు ఆనంద సమయం
— ఒకేసారి 9 డిఏలు మంజూరుకు సంస్ధ నిర్ణయం
— తొందరగా చెలించాలంటున్న ఉద్యోగులు
ప్రజా దీవెన/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ఆ సంస్థ తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మరో కరువు భత్యం డీఏను మంజూరు చేస్తూటీఎస్ ఆర్టీసీ నిర్ణయం ( Another pending drought allowance is TSRTC’s decision sanctioning DA) ప్రకటించింది. ఇప్పటి వరకు పెండింగ్‌లోని మొత్తం 9 డీఏలను సంస్థ మంజూరు చేసింది.
తమ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలు అన్నింటినీ మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ( Telangana State Road Transport Corporation TSRTC Managing Director VC Sajjanar) తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.
అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని (TSRTC employees are working hard) , ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారన్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ ఆర్టీసీ అని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు (9 DAs have been sanctioned in installments since 2019 even under difficult circumstances) చేసిందన్నారు. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించిందని ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఆర్టీసీ ప్రకటించిన డీఏపై ఆర్టీసీ జేఏసీ నేతలు స్పందింస్తూ 2019 జులై నుండి 2023 వరకు 9 డీఏలు అమలు చేసినట్లు అవుతుంది తప్ప అవి అమలు కావాల్సిన రోజు నుండి అమలు కాలేదని పేర్కొన్నారు. మొత్తం 173 నెలల డీఏ ఏరియర్స్ కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం చెల్లలించాల్సి ( Total 173 months DA arrears workers should be paid by RTC management) ఉంటుందన్నారు.
ఈ రకంగా చూసుకుంటే ఒక్కో కార్మిక కుటుంబానికి సగటున రూ.1.70 లక్షలు రావాల్సి ఉందని అంటున్నారు. ప్రకటించిన బకాయిలు త్వరలో చెల్లించి ఉద్యోగులను ఆదుకోవాలని యూనియన్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల బకాయిల చెల్లింపుపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ( RTC is preparing a plan for payment of workers dues) అధికారులు ప్రకటించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన ఆర్పీఎస్ 2013 అరియర్స్ బాండ్ డబ్బులు 173 నెలల డీఏ అరియర్స్‌తో పాటు ఇతర బకాయిలు కూడా మంజూరు చేయాలని కోరుతున్నారు.