Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభం

రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బి అర్ ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. మనం పదేళ్లు పాలించినామని, వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాకముందే ప్రభుత్వం పై ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నారని ఎద్దేవా చేశారు

నాలుగు నెలలకే ఇంత వ్యతిరేకత ఎవరికైనా సాధ్యమా
మళ్ళీ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు

ప్రజా దీవెన, సిద్దిపేట: రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బి అర్ ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. మనం పదేళ్లు పాలించినామని, వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాకముందే ప్రభుత్వం పై ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్ కు తరలించుకుపోయిన ఘనుడు రేవంత్ రెడ్డి అని విమర్శిం చారు. వంద రోజుల్లో ఆరుగ్యారంటీ లు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారని, ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ద్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదనీ, అంతకంటే ఎక్కు వగా పనంటూ ఏమీ లేదని వ్యా ఖ్యానించారు. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చిందని, కాంగ్రెస్ మీద కోపం తో బిజెపి కి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితదని అన్నారు. సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్ లో శుక్రవారం మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నా హక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

బిజెపి పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ అని చెప్పారు. సిలేరును లాక్కుని మనకు అన్యాయం చేసిన పార్టీ బిజెపి అని, పదేళ్లలో బిజేపీ చేసిన ఒక్క మంచి పని ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బి అర్ ఎస్, బిజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురజ చల్లిండని ఇప్పుడు బడేమియ అంటుండని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్, బిజేపీ ఒక్కటై తెలంగాణ లో బి అర్ ఎస్ లేకుండా చేయాలనే కుట్ర పన్నుతు న్నాయని అరోపిoచారు. నిరుద్యోగ భృతి ఇస్తానని, రైలు తెస్తానని అబద్ధాలు చెప్పి ఉప ఎన్నికల్లో గెలిచిండని, మొన్నటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారని గుర్తు చేశారు.

ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. బిజెపి ని ఓడించే శక్తి బి అర్ ఎస్ కె ఉందని ముస్లిం సోదరులు గుర్తించాలని కోరారు. ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బి అర్ ఎస్ గెలవాలని

గులాబీ జెండా ప్రాణం పోసింది సిద్దిపేట అని చెప్పారు. సిద్దిపేట కు అన్యాయం జరిగితే అక్కసు వెళ్ళగట్టితే ఉరుకుందామా, సిద్దిపేట ప్రజలు చీము నెత్తురు ఉన్నోళ్ళం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేసి మోస పోదామా అని వ్యాఖ్యానించారు. సిద్దిపేట లో వివిధ అభివృద్ధి పనులు, రోడ్లు కు 150 కోట్లు రద్దు చేసిండని, సిద్దిపేట అభివృద్ధి ఫై కాంగ్రెస్,బీజేపీ పార్టీ లు రెండు అక్కసు వెళ్ళబుచ్చాయని వివరించారు. అలాంటి వారిని సిద్దిపేట లో ఓట్లు ఎట్లా వేస్తామా, సిద్దిపేట అంటే ప్రత్యేక గౌరవం ఉంది, ఆ ప్రత్యేకతను మరో సారి చాటుకుందామని పిలుపునిచ్చారు.