Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Have you traveled in RTC buses: ఆర్టీసిలో బస్సుల్లో ప్రయాణించారా

-లక్కీ డ్రాలో అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవచ్చు --రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఆర్టీసీ లక్కీ డ్రా ఆరంభం

 ఆర్టీసిలో బస్సుల్లో ప్రయాణించారా

-లక్కీ డ్రాలో అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవచ్చు
–రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఆర్టీసీ లక్కీ డ్రా ఆరంభం

ప్రజా దీవెన/హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణికులకు లకు దక్కనుంది. టి ఎస్ ఆర్ టి సి నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగుతుందని ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్‌ తెలిపారు.

టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్‌ వెనకాల పేరు, వారి ఫోన్‌ నంబర్‌ను రాసి వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్స్‌లలో ప్రయాణికులు వేయాలని ఆయన సూచించారు. బస్టాండ్లు, ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్‌ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి రీజియన్‌ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేయనున్నారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులను సంస్థ అందించనుంది. ప్రతి రీజియన్‌కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది ఆర్టీసీ.

బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకొని సంస్థను ఆదరించాలని అధికారులు కోరారు.