–ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా జర్నలిస్టులకు క్యాష్‌లెస్ వైద్యం అందించాలి
–టీయూడబ్ల్యూజే (143) జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్
Health Cards for Journalists : ప్రజా దీవెన, తిప్పర్తి: జర్న లిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేలా హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడ బ్ల్యూజే (143) చేపట్టిన వారం రోజుల పోస్టుకార్డుల ఉద్యమా న్ని విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా అ ధ్యక్షు డు గుండగోని జయశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. గురు వారం నల్ల గొండ జిల్లా కేంద్రంలో టీ యూడబ్ల్యూజే (143) తిప్పర్తి మండల నూతన కమిటీ సభ్యు లను అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమమే ప్ర ధాన లక్ష్యంగా టీ యూడబ్ల్యూజే (143) నిరంతరం పనిచేస్తోం దని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధనతో పాటు వారి కుటుంబాల సంక్షే మానికి సంఘం అనేక కార్యక్ర మాలు చేపట్టిందని గుర్తుచేశారు.
గతంలో హెల్త్ కార్డుల సాధన కో సం పోరాటం చేయడంతో పాటు మృతి చెందిన జర్నలిస్టుల కు టుంబాలకు ఆర్థిక స హాయం అం దించడం, వారి పిల్లల విద్యకు చేయూతనివ్వడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలోనూ అల్లం నారా యణ నాయ కత్వంలో కరోనా బా రినపడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించి అండగా ని లిచిన విషయాన్ని ప్రస్తావించారు.
ప్రస్తుతం జర్నలిస్టుల హెల్త్ కార్డులు కొన్ని ఆసుపత్రులకే పరి మితం కావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవే ద న వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అ న్ని ప్రభుత్వ, ప్రై వేటు ఆసుపత్రు ల్లో హెల్త్ కార్డులు చెల్లుబాటయ్యేలా ప్రభు త్వం తక్షణ చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. జర్న లిస్టుల ఆరోగ్య భద్రతకు భ రోసా కల్పించడమే లక్ష్యంగా చే పట్టిన పోస్టుకార్డుల ఉద్యమంలో ప్రతి జర్నలిస్టు భాగస్వామి కావా లని కోరారు.
నూతన తిప్పర్తి మండల కమిటీకి అభినందనలు
టీయూడబ్ల్యూజే (143) తిప్పర్తి మండల నూతన అధ్యక్షుడి గా ఎ న్నికైన సీనియర్ జర్నలిస్టు జేరుపోతుల సైదులు గౌడ్, ప్రధాన కా ర్యదర్శిగా ఎన్నికైన నమస్తే తెలంగాణ జర్నలిస్టు జంజరాల ర వికుమార్‌లను జయశంకర్ గౌడ్ అభినందించా రు. నూతన కమి టీ జర్నలిస్టుల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాం క్షించారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర, జిల్లానాయ కులు ఫహీమోద్దీన్, న కిరేకంటి శ్రీనివాస్ గౌడ్, దండంపల్లి రవికు మా ర్ గౌడ్, గంట సైదులు, మా మిడి వెంకటేశ్వర్లు, కారింగు శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు.
Health Cards for Journalists
